గ్లామర్ పాత్రలకే పరిమైతే ఎలా అప్పుడప్పుడు ఎక్స్ ఫోజింగ్ కూడా...
'ఇతర కథానాయికల గురించి నాకు తెలియదు కానీ నాకు అవకాశం ఇచ్చే దర్శకులందరూ నాలో మంచి నటిని చూస్తున్నారు. నేను గ్లామర్ తారని కాదు. ఒకవేళ గ్లామర్ కే పరిమితమై ఉంటే ఈపాటికి ఫేడవుట్ అయ్యి.. ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేదాన్నేమో..." అంటున్నారు త్రిష. ఒకవైపు నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ మరోవైపు గ్లామరస్ కేరక్టర్లు కూడా చేస్తూ కెరీర్ ని బేలన్స్ చేసుకుంటున్నారామె. 'మాములుగా ఒక్కో నాయికను ఒక్కో కోణంలో చూస్తుంటారు దర్శకులు. కొంతమంది నాయికలను 'గ్లామర్" పాత్రలకే మాత్రమే తీసుకుంటారు. అయితే నా విషయంలో అలా కాదు" అంటూ పై విధంగా స్పందించారు త్రిష.
'ఓ ప్రేక్షకురాలిగా నేను థియేటర్ కు వెళ్లాననుకోండి.. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటాను. హీరో, హీరోయిన్లు కనువిందు చేసే కాస్ట్యూమ్స్ లో కనిపించాలని కోరుకుంటాను. అందుకే సినిమాల్లోకి వచ్చిన తర్వాత సాధ్యమైనంతవరకు 'కలర్ ఫుల్"గా ఉండే కేరక్టర్లకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాను. హీరోలు డైనమిక్ గా కనిపించాలని, హీరోయిన్లు గ్లామరస్ గా అగుపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఒకవేళ ప్రేక్షకుల ఇష్టానుసారం కనిపించలేదనుకోండి అప్పుడు 'ఫేడవుట్" అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎక్స్‌పోజింగ్‌కి వెనుకాడడంలేదు. కమల్‌హాసన్ సరసన త్రిష నటించిన 'మన్మధన్ అంబు" త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











