వర్మ రామాయణంపై నాగార్జున..నెగెటివ్ కామెంట్లు
శ్రీరామ రాజ్యం సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో....రంగంలోకి దిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నేనూ రామాయణం సినిమా తీస్తున్నా, నా స్టయిల్ లో తీస్తున్నా, నేను తీయబోయే రామాయణం త్రేతాయుగం నాటికాదు....ప్రస్తుత ట్రెండ్ కు సంబంధించినదే అని ప్రకటించారు. మరో రోజు నా సినిమా నాగర్జునతో విలన్ 'రావణ్ రాజు' పాత్ర వేయిస్తున్నా అంటూ మరో సంచలన ప్రకటన చేశారు. నాగార్జునతో చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉండటంతో వర్మ చెప్పే మాటలు నిజమే కావొచ్చు అంటూ అంతా అనుకున్నారు.
కానీ వర్మ చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివే అని తేలి పోయింది. ఇటీవల ఈ సినిమా గురించి నార్జునను ప్రశ్నించగా...పెద్దగా నవ్వేసి..''వర్మ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందేగా..నేను రావణ్‌రాజ్‌గా నటిస్తున్నానన్న వార్త పెద్ద జోక్'' తేల్చి చెప్పారు.
వర్మ ఏదో ప్రకటన చేయగానే టీవీ ఛానళ్లు ఓ ఎగేసుకుని ప్రచారం చేస్తుంటాయి. ఇలాంటి అబ్దాల కోరును ఓ సెలబ్రిటీగా ట్రీట్ చేయడమే దండగ, ఇలాంటోళ్ల వల్ల సినీ పరిశ్రమ కలుషితం అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











