ఎన్టీఆర్‌కి సెకండ్ సెటప్‌గా కాదు, స్పెషల్‌గా: శృతి హాసన్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంతను మొదటి హీరోయిన్ గా ఎంపిక చేయగా, శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. అయితే తనది సెకండ్ హీరోయిన్ పాత్ర అనడంపై శృతి హాసన్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ 'మీడియా వారు తనది సెకండ్ హీరోయిన్ అంటూ రాస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు. నాది ఈచిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఉన్న కీలకమైన పాత్ర. గబ్బర్ సింగ్ చిత్రంతో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్ మీద అభిమానంతో ఈ స్పెషల్ రోల్ చేస్తున్నాను' అని శృతి హాసన్ వెల్లడించింది.
గతంలో తనకు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. కానీ అప్పుడు డేట్స్ కుదరక పోవడం వల్లనే చేయలేక పోయాను. అంతకు మించిన కారణం ఏమీ లేదు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
గబ్బర్ సింగ్ సక్సెస్ తర్వాత హీరోయిన్ శృతి హాసన్ దశ తిరిగింది. అవకాశాలు బోలుడు వస్తున్నా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆమె తెలుగుగులో 'ఎవడు', 'బలుపు' చిత్రాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్-హరీష్ శంకర్ కాంబినేషన్లో స్పెషల్ రోల్ చేస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











