తన సెక్సీ ఫోటో మార్ఫింగే అంటున్న ‘హీరోయిన్’
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ముఖ్య పాత్రలో...చాందినీ బార్, ఫ్యాషన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన మధుర్ బండార్క్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హీరోయిన్'. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫోటోల్లో కరీనా సెక్సీ చీరకట్టుతో నాజుగ్గా..చాలా స్లిమ్‌గా కనిపిస్తోంది.
అయితే తాను ఫోటోల్లో కనిపించే అంత స్లిమ్‌గా ఏమీ లేనని, అందంతా ఫోటో షాప్ మార్పింగ్ మాయే అంటోంది కరీనా. ఈ కాలంలో ఏ యాడ్ తీసుకున్నా, ఏ ఫిల్మ్ ఫోస్టర్ తీసుకున్నా, ఏ న్యూస్ ప్రింట్ తీసుకున్నా ఫోటో షాప్ ద్వారా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. హీరోయిన్ సినిమాలో తన ఫోటోలు కూడా అలా ఎడిటింగ్ చేసి మరింత సన్నగా, నాజుగ్గా చూపించారని అంటోంది.
బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి వచ్చిన హీరోయిన్ల జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఈచిత్రాన్ని నిర్మించారు.
సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో మాధర్ దర్శకత్వంలో వచ్చిన చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. పైగా కరీనా కపూర్ హీరోయిన్ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












