స్టార్ డమ్ కోసం ఎప్పుడూ ఆశపడలేదు...!?
నేను స్టార్ ని కాదు..నటుడ్ని..నటుడిగా పిలిపించుకోవడానికే ఇష్టపడ్తాను..స్టార్ ని కావాలనుకుంటే కమర్షియల్ సినిమాల వెంట పరుగులు పెట్టేవాడిని అంటున్నాడు హీరో శర్వానంద్. కమర్షియల్ సినిమాల కోసం పాకుటాడితే 'గమ్యం", 'అమ్మచెప్పింది", 'ప్రస్థానం" 'అందరి బంధువయా" వంటి విమర్శకల ప్రశంసలు అందుకునే సినిమాలు చేసి వుండేవాడిని కాదంటోన్న శర్వానంద్, 'ప్రస్థానం" సినిమా ఇండియన్ పనోరమకు ఎంపికవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
'ప్రస్తానం" సినిమా చేసినప్పుడే ఖచ్చితంగా విమర్శకలు ప్రశంసలు అందుకుంటుందని భావించామనీ, కమర్షియల్ చిత్రానికి వుండాల్సిన హంగులు ఆ సినిమాకి వున్నా, ఎందుకో కమర్షియల్ గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయామని శర్వానంద్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులోనూ తాను స్టార్ డమ్ కోసం ఆశపడననీ, వెరైటీ చిత్రాలు రూపొందించేవారికి తానెప్పుడూ అందుబాటులో వుంటానని శర్వానంద్ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











