సల్మాన్‌ మాదిరా? మనకంత సీన్ లేదు: వెంకీ

By Bojja Kumar

హిందీ వెర్షన్ బాడీగార్డ్‌లో సల్మాన్ తన సర్టు విప్పి కండలు ప్రదర్విస్తారు. మీరు కూడా తెలుగు వెర్షన్ 'బాడీగార్డ్'లో ఆయన మాదిరి షర్టు విప్పేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.....'మనకంత సీన్ లేదు, ఆయనలా షర్టు విప్పలేదు(నవ్వుతూ)' అని సమాధారం ఇచ్చారు విక్టరీ వెంకటేష్. త్వరలో తను నటించిన బాడీగార్డ్ సినిమా విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మళయాళ వర్సన్ బాడీగార్డుకు రీమేక్ అయినప్పికీ సీన్ టు సీన్, ప్రేమ్ టు ఫ్రేమ్ అస్సలుండదని...తెలగు నేటివిటీకి తగిన విధంగా, ఇక్కడి ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు వెంకీ.

1990లో మీరు నటించిన 'బొబ్బలి రాజా' సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమాలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఆ వార్తలు నిజమేనా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...'నిజమే ఆ సినిమాకు సీక్వెల్ గా రాణా మెయిన్ రోల్ లో సినిమా రాబోతోంది. అందులో నేను కీ రోల్ చేస్తున్నాను. యానిమేషన్ క్యారెక్టర్లతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఆ సినిమా రూపొందుతోంది' అని తెలిపారు.

మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి సమర్పరణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'బాడీగార్డ్' చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వెంకటేష్, త్రిష, సలోని, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రగతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు : కోన వెంకట్, సంగీతం : థమన్, ఫోటో గ్రఫీ : శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ : గౌతం రాజు, డాన్స్ : రాజు సుందరం, బృంద, విష్ణుదేవా, కో-డైరెక్టర్, సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ మైనేని, నిర్మాతలు : బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : గోపీచంద్ మలిని

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X