సెక్స్ ముద్ర తనపై ఉండకూడదనే తాపత్రయం...
హైదరాబాద్: బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఇండో-కెనడియన్ మాజీ శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆమె గతంలో నటించిన సెక్స్ సినిమాలే. తక్కువ కాలంలోనే ఆమెకు ఇంత గుర్తింపు రావడానికి కారణం కూడా ఆమె గత సినిమాలే. అయితే బాలీవుడ్లో వచ్చిన తర్వాత సన్నీ లియోన్ పూర్తిగా మారి పోయింది. సెక్స్ సినిమాలకు దూరంగా ఉంటూ భారతీయ సినిమాల్లో బిజీ అయిపోయింది.
బాలీవడ్లో ఆమెను తొలుత గ్లామర్ పాత్రలు, ఐటం సాంగ్స్ అవకాశాలు వచ్చాయి. అచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని గుర్తింపు తెచ్చుకుంది. మెల్లి మెల్లిగా బాలీవుడ్లో సన్నీ లియోన్ తన రూటు మార్చుకుంటోంది. సన్నీ అంటే సెక్స్ సినిమాలు కాదు, మంచి నటి అనే పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతోంది.

ప్రత్యేక గీతాలు, గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రల ద్వారా హీరోయిన్‌గా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం లీలా. కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనుందట.
అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు బాబీఖాన్ తెలిపారు. ఈ సినిమా గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ ఒకే సినిమాలో మూడు భిన్నమైన పాత్రల్ని పోషించడం మధురానుభూతినిస్తోంది. ఓ సవాల్‌లా స్వీకరించి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో నాపై వున్న శృంగార తార ముద్ర చెరిగిపోతుందన్న నమ్మకముంది. నా కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలుస్తుంది అని అంటోంది.


Click it and Unblock the Notifications











