ఐ యాం నెంబర్ వన్ అంటున్న నాగచైతన్య...!

By Sindhu

నాగచైతన్య, తమన్నాల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం టైటిల్ ని ఐ యామ్ నెం 1 గా మార్చినట్టు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి దటీజ్ మహాలక్ష్మీ అనే టైటిల్ అనుకున్నారు. ఆతర్వాత ఐలవ్ యు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ రెండు కాక ఐ యామ్ నెం 1 అనే టైటిల్ ని కన్ఫం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ని ఇంకా అధికారికంగా వెలువరించలేదు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. గ్యారెంటీగా ఈ చిత్రం చూసిన వారు ఫ్రెష్ గా ఫీలవుతారు అని చెప్పతున్నారు. యువతకు నచ్చే స్టైలింగ్, మ్యానరిజమ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని చెప్ప్తున్నారు.

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఆర్య 2, జగడం చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో సుకుమార్ ఈ సినిమాని ఎలాగయినా సంచలన విజయం సాధించేలా హిట్ కొట్టాలని చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్‌ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు. ఈ చిత్రం సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X