అప్పటి వరకు నో, స్ట్రైక్ మొదలెట్టిన సమంత
ప్రస్తుతం సమంత టాలీవుడ్లో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నప్పటికీ...ఇప్పటి వరకు కెరీర్లో సమంతకు చెప్పుకోదగ్గ గొప్ప పాత్రలు రాలేదనే చెప్పాలి. కేవలం అందం...పెర్ఫార్మెన్స్ పరంగా తప్ప నటన పరంగా ఆమెకు నిరూపించుకునే అవకాశమే రాలేదు. దీంతో సమంత ఆలోచనలో పడింది.
ఇలాగే బండి నడుపుకుంటూ వెళితే...ఇతర హీరోయిన్లలా కొన్నాళ్లకు తన కెరీర్ కూడా అతి త్వరలోనే మసకబారే అవకాశం ఉన్న నేపథ్యంలో రూటు మార్చాలని నిర్ణయించుకుంది. కేవలం హీరోకు జోడీగా, అతనితో పాటు డాన్సులు చేయడం లాంటివి కాకుండా తన పాత్రకు ప్రాధాన్యం, నటనకు అవకాశం ఉండి వ్యక్తిగతంగా తనకు గుర్తింపు తెచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు సమంత తన మనసులోని మాటను...ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 'ఇప్పుడు నేను స్ట్రైక్‌లో ఉన్నాను. నేను అనుకున్న గొప్ప పాత్ర దొరికే వరకు ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోదలుచుకోలేదు' అని సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మరి సమంత అనుకున్న పాత్ర దొరికేదెప్పుడో? చూడాలి.


Click it and Unblock the Notifications












