వన్ ఉమన్ మేన్ అయితే... మరి ఆ ఎఫైర్ల సంగతేంటి?
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం లైఫ్ స్టైల్ గురించి, బాలీవుడ్ భామలతో అతని ఎఫైర్ల గురించి కొత్తగా చెప్పాలిన పనిలేదు. తన పర్ ఫెక్ట్ ఫిజిక్‌తో అమ్మాయిల మనసు ఇట్టే దోచేసే జాన్ బాలీవుడ్ సెక్సీ లేడీ బిపాసా బసుతో దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసాడు. ఇద్దరు పెళ్లి చేసుకోబోతారు అనే సమయంలో మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
బిపాసాతో విడిపోయిన తర్వాత జాన్ అబ్రహం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ప్రియా మార్వాకు దగ్గరయ్యాడు. జాన్ అబ్రహం-ప్రియా పెళ్లి చేసుకోబోతున్నారని, లాస్ ఏంజిల్స్ లో వీరి వివాహం నిశ్చితార్థం కూడా జరిగిందని ఆ మధ్య వార్తలు వచ్చినా.... ఆ తర్వాత అవన్నీ వట్టి పుకార్లే అని తేలి పోయాయి.
అయితే జాన్ అబ్రహం మాత్రం తనకు ఇండస్ట్రీలో చాలా మంది ఆడవారితో సంబంధాలు ఉన్నాయనే రూమర్లపై మండి పడుతున్నాడు. జీవితంలో ఎప్పటికీ ఒకే మహిళను కలిగి మగాడిగా ఉండి పోతానని, సింప్లిసిటీగా అందంగా ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, తనకు ఇప్పటి వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
అయితే జాన్ అనుకోకుండా తనలోని కొన్ని లోపాలను బయట పెట్టారు. నా జీవితం పర్ ఫెక్టుగా లేదు. జీవితంలో కొన్ని మిస్టేక్స్ చేసాను. ప్రస్తుతానికి ఓకే. పొరపాట్లు చేయని మనిషంటూ ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. జాన్ మాటలు విన్న చాలా మంది ఇంతకాలం పలువురితో ఎఫైర్లు నడిపిన జాన్ ఇకపై మారాలని నిర్ణయించుకున్నాడు కబోలు అని అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











