రామ్ చరణ్, మహేష్ లతో డైరెక్ట్ స్ట్రయిట్ మూవీ తీస్తా..!?
తమిళం లో మురుగదాస్ చేసిన ప్రయోగాలు తెలుగులో ఎ దర్శకుడు చేయలేదనే చెప్పవచ్చు. సెవెన్త్ సెన్స్ మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టడంతో ఆ సిమా దర్శకుడు మురుగదాస్ తెలుగు హీరోలపై పడ్డారు. గజిని చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన తమిళ దర్శకుడు మురుగదాస్ తెలుగుహీరోల సత్తా ఏమిటో తనకు తెలుసునని అంటున్నారు. తమిళ చిత్రాలు తెలుగు చిత్రాలు రెండు సమానమేనని అంటున్న ఆయన సెవెన్త్ సెన్స్ చిత్రాన్ని హిందీలో తీసే ఆలోచన ఉందని చెప్పారు.
తాజా ఆయన ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాను అని చెప్పుకొచ్చారు. హీరో ఎవరనేది తర్వాత చెబుతాను. తెలుగులో రామ్‌చరణ్, మహేష్‌లతో కూడా సినిమాలు చేస్తాను. నాకు రాజమౌళి, మణిరత్నం అంటే చాలా ఇష్టం. యాక్షన్, రొమాన్స్ మూవీస్ చేయాలనుంది అన్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్ లతో సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మురుగదాస్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











