పెళ్ళికి ముందు ప్రాస్టిట్యూట్ గా మనీషా కొయరాలా..
త్వరలో నేపాల్ కి చెందిన వాణిజ్య వేత్త సామ్రాట్ దహాల్ ను వివాహం చేసుకోనున్న మనీషా కోయిరాల ప్రస్తుతం ఓ చిత్రం చేస్తోంది. ఏక్ సెకెండ్ జో జిందగీ బదల్ దే టైటిల్ తో నిర్మితమయ్యే చిత్రంలో మనీషా స్ట్రీట్ ప్రాస్టిట్యూట్ గా కనిపించనుంది. పార్ధో ఘోష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం జూన్ నాలుగున రిలీజ్ కానుంది. ఇక మనీషా వివాహం జూన్ 19వ తేదీన జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే పెళ్ళికి ఓ పదిరోజులు ముందు ఈమె వేశ్యగా నటించిన చిత్రం రిలీజ్ కానుంది. దాంతో కొంతమంది ఆ చిత్రం రిలీజ్ ను వాయిదా వేసుకోమని చెప్తున్నారుట. అయితే మనీషాకు ఆ చిత్రం విజయంపై అపారమైన నమ్మకం ఉంది. అయినా దీనికి పెళ్ళికి లింక్ పెడతారేంటి..అది పాత్రేగా అని విసుక్కుంటోంది. అలాగే మళయాళంలో నిర్మితమవుతున్న ఎలక్ట్రా అనే చిత్రంలో నయనతార కు ఆమె తల్లిగా చేయనుంది.


Click it and Unblock the Notifications











