జీవితంలో ఒక్కసారైనా జూ ఎన్టీఆర్ తో డాన్సు వేయాలనేదే నాకోరిక..
రాజు మహారాజు సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన భామ తషూ కౌశిక్. మొదటి సినిమాలోనే తన అందాలను ఆరబోసిన తషూ కౌశిక్ ఆతర్వత గ్రాడ్యుయేట్ అనే సినిమాలో నటించింది. తను హీరోయిన్ గానటించినటువంటి రెండు సినిమాలు తషూ కౌశిక్ కు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో సరైన బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఇటీవల తషూ కౌశిక్ తన మనసులోని ఒక మాటను బయట పెట్టింది. ఏంటీ ఆమనసులోని మాట అనుకుంటున్నారా..
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తో ఒక్క సారైనా ఆడిపాడాలని కొరిక తనకు ఉందని ఇటీవల వెల్లడించారు. ఈ అమ్మడి ముచ్చట తీర్చడానికి యంగ్ టైగర్ రెడీగా ఉన్నాడో లేడోగాని, తన ముచ్చట తీర్చుకోవడం కోసం తషూ కౌశిక్ ఎంత ఆశిస్తుందనేది అర్దం అవుతూనే ఉంది. ఇంత తహా తహాలాడుతున్న తషూ కౌశిక్ ని చూసైనా తనకో బ్రేక్ తోపాటు, ఓ స్టెప్పు ప్రసాదించి తషూ కౌశిక్ అందాలను క్యాష్ చేసుకునే నిర్మాత ఎవరవుతారో చూద్దాం.


Click it and Unblock the Notifications











