అందాల తాప్సీ కి అప్పుడే ఆ పిచ్చి పట్టుకుంది
రాఘవేంద్రుడి రసికత నేత్రం నుంచి వెలవడ్డ తాప్సీకి అప్పుడే ఐటం సాంగ్ ల పిచ్చి పట్టుకుంది. అప్పటికీ ఆమె ప్రభాస్ సరసన,రవితేజ సరసన, విష్ణు సరసన బుక్కయినా ఇంకా బిజీ కావాలనో మరెందుకో గెస్ట్ రోల్స్ కీ, ఐటం సాంగ్స్ కీ నే రెడీ...మీరు సంప్రదించండి అని ప్రకటనలిచ్చేస్తోంది. ఈ కర్లీ హెయిర్ ముద్దుగుమ్మ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...నాకు ఎక్సపోజింగ్ అంటే ఇంట్రస్ట్ లేదు. నేను నా యాక్టింగ్ స్కిల్స్ ను చూపాలనుకుంటున్నాను. అంతేగానీ నా అందాన్ని కాదు. అందుకే సెకెండ్ హీరోయిన్ ఆఫర్స్ ని కూడా కాదనకుండా ఒప్పుకుంటున్నాను. అలాగే నేను గెస్ట్ రోల్స్ కీ, ఐటం నెంబర్స్ కీ కూడా రెడీ అంది. ఇక ఈ పంజాబీ బ్యూటి ప్రస్తుతం ప్రభాస్ సరసన దిల్ రాజు నిర్మించే చిత్రంలో చేస్తూ బిజీగా ఉంది. అందులో ఆమె అమిరికాలో ఉండే ఎన్నారై పాత్రం. మగరాయుడులా బిహేవ్ చేస్తూ అందాలు ప్రదర్శిస్తుంది. ఇక రవితేజ సరసన ఆమె చేయబోయే వీర చిత్రం త్వరలో సెట్స్ కు వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











