బికిని వేసి అందాలు ఆరబోస్తానంటున్న సమంత
బికినీ వేయటానికి నేనేమీ గిల్టీగా ఫీల్ కాను...అవసరమనుకుంటే నా తదుపరి చిత్రాల్లో వేస్తానేమో..అయినా నేనేమీ సంప్రదాయబద్దమైన చీరలే కట్టుకోవాలని స్టిక్ అయిలేను..స్టోరీ,క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బికినీ వేస్తాను అంటోంది సమంత. ఏ మాయ చేసావే చిత్రంతో పాపులర్ అయిన సమంత..బికినీ వేస్తాను..మీరు ఆలోచించుకోండి అన్నట్లు తన దర్శకులకు ఇండైరక్ట్ గా సందేశం పంపుతున్నట్లు ఈ స్టేట్ మెంట్ రీసెంట్ గా ఇచ్చింది. ఇక ఏ మాయ చేసావే చిత్రంలో సమంత కట్టుకున్న కాటన్ శారీస్ యూత్ కి తెగ నచ్చేసాయి. అమ్మాయిలుకి మళ్ళీ చీరలు క్రేజ్ వచ్చింది. అయితే అంతలోనే నేను బికినీ వేసి నా అందాల ప్రదర్శన పెడతానని సమంత ప్రకటించింది.
ఇక గౌతమ్ సార్ నన్ను చీరకట్టులో ఈ చిత్రంలో చూపెట్టారు. ఆయనకు బికినీలలో నన్ను చూపెట్టడం ఇష్టలేదు. ఆ విషయం ప్రతీ ఫ్రేమ్ లోనూ స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో కలిసి బృందావనంలో చేస్తున్నాను. అలాగే మహేష్ బాబు సరసన చేయటానికి కూడా కమిట్ అయ్యాను. మరికొన్ని తమిళ చిత్రాలు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి అంది. ఇక సమంత తల్లి తండ్రులు తెలుగువాళ్ళు. అయితే ఆమె పుట్టింది పెరిగింది మాత్రం కేరళలో. ఆమె పూర్తి పేరు సమంతా రుతు ప్రభు.


Click it and Unblock the Notifications











