ఇండియాలో తొలిసారి వావి వరుసల్లేని సినిమా : బ్రదర్-సిస్టర్ లవ్ స్టోరీ (ట్రైలర్)
ఇండియన్ సినీ చిరత్రలోనే ఓ డిఫరెంట్ సినిమా రాబోతోంది. బ్రదర్-సిస్టర్ లవ్ స్టోరీతో సినిమా రాబోతోంది.
Recommended Video

ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలు చాలా వస్తున్నాయి. మనం ఇండియాలో ఇప్పటి వరకు చూడని చాలా జోనర్ చిత్రాలు ఈ మధ్య రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ టచ్ చేయని ఓ సబ్జెక్టుతో ఓ సినిమా రాబోతోంది.
మానవ జాతికి, అనుబంధాలకు విరుద్ధమైన ఒక కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన అన్నా-చెల్లెళ్ల బంధాన్ని చాలా నీచంగా చూపించే కథతో ప్రేక్షకుల ముందుకు ఓ సినిమా వస్తోంది.

ఐయామ్ రోషిణి
ఐయామ్ రోషిణి పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మనోజ్ జయంతిలాల్ భాటియా అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ థామస్ అనే వ్యక్తి నిర్మిస్తున్నారు.

సినిమాలో ఏం చూపించబోతున్నారు?
ఇది ఒక అమాయకమైన అమ్మాయి కథ... చాలా స్ట్రిక్టుగా ఉండే ఫాదర్, మోసగాడైన బాయ్ ఫ్రెండ్, నీతిలేకుండా తనపై కన్నేసిన అంకుల్, ఇన్ సెన్సిటివ్ మదర్...... ఓ కేరింగ్ బ్రదర్. ఈ పరిస్థితులు, పరిణామాల క్రమంలో అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారట.

నటీనటులు
ఈ చిత్రంలో రోషిణి పాత్రలో అంకిత పరిహార్ నటిస్తోంది. యష్ రాజపురా, వినీత్ వాధ్వా, మనోజ్ జైస్వాల్, అపర్ణ ఉపాధ్యాయ్, హరీష్ చందిరామని, మనీషా యాదవ్, వైష్ణవి షెన్వి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సెన్సార్ అనుమతి ఉంటుందా? వివాదాలు ఉంటాయా?
ఈ సినిమాకు అసలు సెన్సార్ అనుమతి లభిస్తుందా? అన్న చెల్లెల్ల అనుబంధాన్ని అబాసు పాలు చేసే విధంగా ఉన్న ఇలాంటి సినిమా విడుదలకు ప్రజలు అంగీకరిస్తారా? అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











