»   »  పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చెయ్యాలంటే నాకు భయం: రాజమౌళి

పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చెయ్యాలంటే నాకు భయం: రాజమౌళి

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : కెరీర్ లో అందరూ స్టార్స్ తో వర్క్ చేసి వారిని పెద్ద స్టార్స్ చేసిన దర్శకుడు రాజమౌళి..తను పెద్ద పెద్ద స్టార్స్ తో చేయటానికి భయపడతాను అంటున్నారు. ఓ లీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపరుకి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ.. బేసిక్ గా నేను పెద్ద స్టార్స్ ని హ్యాండిల్ చేయటానికి భయపడతాను. పెద్ద స్టార్స్ తమను సూపర్ స్టార్స్ చేసిన పద్దతలును ఫాలో అవుతూంటారు. వారితో మనం సినిమా చెయ్యలాంటే వాటిని నేను అనుసరించాల్సిందే. అంతేగాక ఎక్సపెక్టేషన్స్, బడ్జెట్స్ అడ్డంకిగా నిలుస్తాయి. దాంతో నేను ఫిల్మ్ మేకింగ్ ని ఎంజాయ్ చేయలేను అన్నారు.

  అంతేగాక.. ఓ కథకుడుగా నేను స్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎడ్జెస్ట్ మెంట్స్ చెయ్యాల్సి వస్తుంది. దర్శకుడు, హీరో ఇద్దరూ ఓపెన్ మైండ్ తో పనిచేయకపోతే ఆ ప్రాజెక్టులు వర్కువుట్ కావు. అందుకే నేను నా చిన్న ప్రపచంలో ఉండటానికి ఇష్టపడతాను...పెద్ద స్టార్స్ జోలికి వెళ్లను అన్నారు. అలాగే రజనీకాంత్ తన ఈగ చిత్రం చూసి మెచ్చుకున్న విషయం వివరించారు.

  తన కుటుంబం గురించి చెప్తూ..తనది ప్రేమ వివాహం అని చెప్పారు. అలాగే..నా భార్య..సంగీత దర్శకుడు కీరవాణిగారి భార్య సోదరి. ఆమె వివాహం నాటికి డైవర్సెడ్...ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె విడాకులు అనేది నేను ప్రపోజ్ చెయ్యటానికి అడ్డంకిగా అనిపించలేదు. ఆమె ఆలోచనలలో చాలా స్ట్రాంగ్ గా ఉండే మహిళ. నాకు ఎటువంటి సమస్య ఎదురైనా ఆమె వెంటనే ఏక్టివ్ గా...ఆ సమస్యను ఛేధించగలదు. నా జాబ్ కేవలం...సినిమా లు రాసుకోవటం...డైరక్ట్ చేయటం. ఆమె ఇంటి మొత్తానికి ఇంఛార్జ్. నా ఫైనాన్స్ వ్యవహారాలు ఆమే చూస్తుంది. నేను ఆమెను ఎంపిక చేసుకోవటంలో తెలివిగా వ్యవహించాను అంటూ తన భార్య ని పొగడ్తల్లో ముంచెత్తారు.

  ఇక ప్రస్తుతం రాజమౌళి...తన తాజా చిత్రం ప్రభాస్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యి షూటింగ్ కి రెడీ అవుతోంది. ప్రభాస్ సైతం వేరే ఏ ప్రాజెక్టులూ ఒప్పుకోకుండా..ఒప్పుకున్న ప్రాజెక్టులు ఫినిష్ చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ,తెలుగు,హింది భాషల్లో రూపొందనుందని సమాచారం. మర్యాదరామన్న నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజమౌళి గురువు...రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

  English summary
  Basically, I am scared of handling bigger stars. Big stars follow certain set patterns that have made them into superstars. If I have to make a film with them, I have to follow that pattern as money and expectations are at stake. And thus, I will not enjoy making that film. As a storyteller, I will have to make adjustments keeping the star in mind. If two people will not be open-minded and excited working together in a project, it will not work. That is why I keep myself in my own small world as I am scared that I won't be able to excite them.
 Let's talk about your wife? We had a love marriage as my wife is my cousin MM Kreem's wife's sister. She was divorced at the time we got married and had a son. Her being divorced was neither a reason nor a deterrent for me and I proposed to her. She is a strong person, who though seems to be naive in normal situations, acts immediately and perfectly in difficult situations where my mind stops working. My only job is to write and make my films. She is in charge of the family and my finances. I was actually quite clever in choosing her.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more