మహేష్ లాంటి వాళ్లను దూరం పెడతాను: కాజల్
బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ లాంటి గ్యాంగస్టర్స్ ను చూస్తే నాకు భయం..నేను అలాంటి వాళ్లతో ప్రేమలో పడను.నా నెంబర్ ఇస్తే వెంటనే మార్చేస్తాను అంటోంది కాజల్. బిజినెస్ మ్యాన్ ప్రమోషన్ లో కలిసిన మీడియాతో ఆమె అలా స్పందించింది. ఆమె బిజినెస్ మ్యాన్ చిత్రంలో చిత్ర పాత్రను చేసింది. చిత్ర ముంబై పోలీస్ కమీషనర్ కూతురు. ఆమె పెయింటర్. ఆమెను మొదట తన అవసరం కోసం సూర్య ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత ఆ పాత్ర గ్యాంగస్టర్ గా ఎదిగిన సూర్య భాయ్ తో కాజల్ ప్రేమలో పడుతుంది. అదే సమయంలో అతన్ని అసహ్యించుకుంటుంది. ఇలా రెండు సంఘర్షణల మధ్య నలిగిపోతూ ఉంటుంది. నిజ జీవితంలో అలాంటి వ్యక్తి తారసపడి ప్రేమన ప్రపోజ్ చేస్తే ఏంటి పరిస్ధితి అంటే ఆమె ఇలా స్పందించింది.
అలాగే..నాకు పూరి జగన్నాధ్ ఆ పాత్రను చెప్తున్నప్పుడు చాలా ధ్రిల్ల్ గా ఫీలయ్యాను..చిత్ర పాత్ర చాలా ఇండిపెండెంట్ గా ఉంటుంది. అమాయికంగా ఉంటుంది.కానీ ఆమె చాలా సంఘర్షణకు లోనవుతుంది. ఇలా ఇన్నర్ కాంప్లిక్ట్ తో వచ్చే పాత్రలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే నేను వెంటనే యస్ అనేసాను అంది. అదే డార్లింగ్ సినిమా విషయానికి వస్తే ఆ పాత్ర నా నిజ జీవితానికి బాగా దగ్గరగా ఉంటుంది. నేను ప్రతీ పాత్రలో నన్ను నేను చూసుకోవాలని ప్రయత్నిస్తాను. ఆ రకంగా నేను ఆ పాత్రలకు ప్రాణం పోయిటానికి ప్రయత్నిస్తూంటాను అంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన రెబెల్ చిత్రం చేస్తోంది. అలాగే రామ్ చరణ్ తాజా చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











