ఆ ఒక్కటీ అడగొద్దంటున్న సెక్సీ లేడీ
ఈ సాంగులో తన పెర్ఫార్మెన్స్ గురించి గీతా బస్రా స్పందిస్తూ... 'బాలీవుడ్లో రాణించాలనే లక్ష్యంతో యుకె నుంచి ఇండియా వచ్చాను. కానీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదు. కానీ ఈ సాంగు తనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది. మరిన్ని అవకాశాలు రావడానికి ఐటం సాంగు ఉపకరిస్తుంది' అని చెప్పుకొచ్చింది.
ఇతర వివరాల్లోకి వెళితే...
క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం ఖరారైనట్లు, త్వరలోనే ఇరు కుటుంబాల పెద్ద అంగీకారంతో ఇద్దరు ఏకం కాబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హర్భజన్, గీతా బస్రా ఈ సంవత్సరం వివాహం చేసుకోబోతున్నట్లు జాతీయ మీడియాలో సైతం గాసిప్స్ వెలువడ్డాయి.
ఈ విషయంలో మరోసారి ఆచితూచి వ్యవహరించింది గీతా. మేమిద్దరం మంచి స్నేహితులం, భజ్జీ నాకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అంటూనే తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని అంటోంది. భవిష్యత్‌లో అయినా పెళ్లి చేసుకుంటారా? అంటే మేమిద్దరం స్నేహితులం, అయినా మా వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలిన అవసరం లేదు. ఇప్పటివరకైతే పెళ్లి గురించి నేనేమీ ఆలోచించలేదు అంటూ తెలివిగా సమాధానం ఇస్తోంది.


Click it and Unblock the Notifications












