»   » జాతీయ వ్యాధి: టీమిండియా ఓటమిపై వర్మ సంచలన ట్వీట్

జాతీయ వ్యాధి: టీమిండియా ఓటమిపై వర్మ సంచలన ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించారు. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలై వరల్డ్ కప్ టోర్నీ నుండి నిష్క్రమించిన నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా పలు సంచలన కామెంట్స్ చేసారు.

ఓ వైపు భారత క్రికెట్ అభిమానులంతా బాధలో ఉంటే...... నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీటాడు. దేశానికి ‘క్రికెటైటిస్' అనే వ్యాధి పట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మందు, సిగరెట్ వల్ల నష్టం వ్యక్తుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ క్రికెట్ వల్ల దేశానికి నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్స్ క్రింది విధంగా ఉన్నాయి.

టీమిడియా ఓడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను క్రికెట్ ను ద్వేషిస్తాను. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే క్రికెట్‌ను ద్వేషిస్తున్నాను. క్రికెట్ వల్ల దేశానికి చాలా నష్టం కలుగుతోంది. చాలా మంది క్రికెట్ మ్యాచ్ సమయంలో పని చేయకుండా టీవీలు చూస్తూ ఉండి పోతున్నారు అని వర్మ ట్వీట్ చేసారు.

‘క్రికెటైటిస్' అనే ప్రమాదకరమైన వ్యాధి నుండి ఈ దేశ పౌరులను కాపాడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. టీమిండియాను మళ్లీ మళ్లీ ఓడించాలని ఇతర దేశాల జట్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశ పౌరులు క్రికెట్ చూడటం ఆపేసి, చక్కగా పని చేసుకునే ఆలోచన వచ్చే వరకు ఇలానే పదే పదే ఓడించాలని కోరుకుంటున్నాను అని వర్మ ట్వీట్ చేసారు.

I am so happy India lost because I hate cricket: RGV

ఆల్కహాల్, సిగర్ రెట్ లాంటి వాటికి బానిస అయితే....ఆ నష్టం వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. కానీ ఈ దేశం క్రికెట్ కు బానిస అవుతే అది జాతీయ వ్యాధి అవుతుంది. ద్వేషించే వాళ్లను నేనే ప్రేమిస్తాను..ఎందుకంటే ద్వేషం ప్రేమకంటే స్పైసీగా ఉంటుంది అని వర్మ ట్వీట్ చేసాడు.

English summary
"I am sooooo happyyy India lost because I hate cricket..nd if there's anything I hate more than cricket then it's people who love cricket" Ram Gopal Varma tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu