»   » బాహుబలిపై అల్లు అర్జున్ ట్వీట్, యాంటీ ఫ్యాన్స్ ఎదురు దాడి!

బాహుబలిపై అల్లు అర్జున్ ట్వీట్, యాంటీ ఫ్యాన్స్ ఎదురు దాడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా స్టైలిష్ స్టర్ అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

'బాహుబలి' చిత్రానికి జాతీయ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంది, తెలుగు సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు రావడంపై గర్వంగా ఫీల్ అవుతున్నాను. తెలుగు సినిమా పరిశ్రమ గర్వించాల్సిన సమయం ఇది. రాజమౌళిగారికి, అండ్ టీంకు థాంక్స్ అంటూ బన్నీ ట్వీట్ చేసారు.


'బాహుబలి' లాంటి గొప్ప చిత్రంలో నా ఫ్రెండ్స్ ప్రభాస్, రానా భాగమైనందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమను మరో లెవల్ కి తీసుకెళ్లినందుకు రాజమౌళి గారికి థాంక్స్ అంటూ బన్నీ ట్వీట్ చేసారు. అయితే బన్నీ ట్వీట్ పట్ల కొందరు యాంటీ ఫ్యాన్స్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ఎదురు దాడి చేయడం గమనార్హం. బన్నీ అంటే పడని వారే ఈ ట్వీట్స్ చేసారని తెలుస్తోంది. 


బన్నీ ట్వీట్ తో పాటు ఇతర సెలబ్రిటీలు బాహుబలి సినిమా గురించి చేసిన ట్వీట్స్ స్లైడ్ షోలో....


బాహుబలిపై బన్నీ

బాహుబలి చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు రావడంపై బన్నీ ట్వీట్.


ప్రభాస్, రానా

ప్రభాస్, రానాలను ప్రస్తావిస్తూ బన్నీ ట్వీట్


ఎన్టీఆర్ ట్వీట్

బాహుబలి చిత్రానికి అవార్డు రావడంపై ఎన్టీఆర్ ట్వీట్


నాగార్జున

బాహుబలి టీంకు కంగ్రాట్స్ చెబుతూ నాగార్జున ట్వీట్


సమంత

బాహుబలి టీంకు కంగ్రాట్స్ చెబుతూ సమంత ట్వీట్


అల్లరి నరేష్

బాహుబలి టీంను అభినందిస్తూ అల్లరి నరేష్ ట్వీట్


సాయి ధరమ్ తేజ్

బాహుబలి, కంచె చిత్రాలను అభినందిస్తూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్


English summary
"I am soo Proud that #bahubali won the National Award Best Film. Such a Proud moment for Telugu Film Industry. Thank u rajmouli garu n team. Really happy for my friend Prabhas n RanaDaggubati . Thanks ssrajamouli garu for elevating Telugu Film to another league." Allu Arjun tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu