తన వయస్సు పదహారేనని సినీ నటి,ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద చమత్కరించారు. శుక్రవారం ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసమేతంగా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా తన పుట్టిన రోజున శ్రీవారిని దకర్శించుకుని ఆశీస్సులు పొందటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఎన్నో పుట్టిన రోజు అని అడిగితే పదహారవ పుట్టిన రోజు అని ఆమె బదులిచ్చారు. మరో సారి ఎంపీగా పోటీ చేస్తున్న తాను వెంకన్న ఆశీస్సులతో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసారు. అనంతరం జయప్రద టీటీడి ఛైర్మన్ ఆదికేశవులు నాయుడుతో కలిసి నిత్యాన్నధానంలో భోజనం చేసారు.