»   »  75శాతం లివర్ పాడైంది: షాకింగ్ విషయం వెల్లడించిన మెగాస్టార్

75శాతం లివర్ పాడైంది: షాకింగ్ విషయం వెల్లడించిన మెగాస్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షాకింగ్ విషయం బయట పెట్టారు. బిగ్ బి తరచూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం... మళ్లీ వెంటనే కోలుకుంటుండటం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు సీరియస్ అనారోగ్యం ఏమీ లేదని అభిమానులు భావిస్తూ వచ్చారు.

తాజాగా అమితాబ్ ఓ షాకింగ్ విషయం బయట పెట్టారు. తనకు హెపటైటిస్ బి వైరస్ సోకిందని, దాని వల్ల 75 శాతం లివర్ పాడైపోయిందని కేవలం 25 శాతం లివర్ మాత్రమే ఆరోగ్యంగా ఉందని చెప్పారు. 1983లో కూలీ సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనకు రెండొందల మంది రక్తమిచ్చారు. ఇందులో ఒకరి రక్తం నుంచి హెపటైటిస్ బి వచ్చిందని అనుమానిస్తున్నారు.

I am surviving only on 25 per cent of my liver today: Amitabh Bachchan

ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ..‘కూలీ మూవీ సెట్లో యాక్సిడెంట్ తర్వాత హెపటైటిస్ బి నాకు యాక్సిడెంటల్ గా వ్యాపించింది. ఆ సమయంలో నాకు దాదాపు 200 మంది రక్తదానం చేసారు. దాదాపు 60 బాటిళ్ల రక్తం ఎక్కించారు. ఈ క్రమంలోనే ఆ వైరస్ వచ్చి ఉంటుంది. చాలా కాలం అనంతరం వివిధ టెస్టుల తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు' అని తెలిపారు.

2000 సంవత్సరం వరకు, అంటే యాక్సిడెంట్ అయిన 18 ఏళ్ల వరకు ఎలాంటి సమస్యా రాలేదు. మెడికల్ చెకప్స్ లో అంతా నార్మల్ గానే వచ్చింది. కొంత కాలం తర్వాత దాదాపు 75 శాతం లివర్ పాడైనట్లు గుర్తించారు. ఇపుడు నేను మీ ముందు నిలబడ్డానంటే కేవలం 25 శాతం లివర్ ఆరోగ్యంగా ఉండటం వల్లే అని వెల్లడించారు.

English summary
Amitabh Bachchan made a startling revelation about surviving only on 25 per cent of his liver today having lost the rest 75 percent to the deadly Hepatitis B virus.
Please Wait while comments are loading...