ఒకరిని అనుసరించేది ఫ్యాషన్ కాదు..నేను చాలా రొమాంటిక్...
వేదం సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన బంగారు బొమ్మ 'దీక్షాసేథ్" తొమ్మిదేళ్ళకే 'ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న ఆమెకు మోడల్ గా మంచి అనుభవమే ఉంది .ప్రస్తుతం ఆమె రవితేజ సరసన మిరపకాయ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు చెప్పింది. వేదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దీక్షాసేథ్ వేదం సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నారు. ఈ గుర్తింపును ఇలానే కంటిన్యూ చేస్తానని చెబుతుంది. నాకు నచ్చినట్లు ఉండటమే నాకు ఆనందం అయినా ఒకరిని అనుసరించేది ఫ్యాషన్ కాదు అంటోంది.
తనకు చీరలు అంటే చాలా ఇష్టం అని సందర్బాన్ని బట్టి పార్టీవేర్, ఫార్మల్ వేర్ వేసుకుంటాను. నా గ్లామర్ సీక్రెట్ రోజూ యోగా చేయడం జిమ్ కెళ్లడం. నేను చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా రియల్ లైప్ లో చాలా రొమాంటిక్ గా ఉంటాను అంటోంది. నాకు మోడలింగ్ అంటే ఇష్టం. అలానే సినిమాల్లోకి వచ్చాను అని చెప్తోంది. ఇంతేగాక..దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీలోనూ మంచి అవకాశాలు వస్తే నటించాలన్నది నా కోరిక. నటిగా ఒక్క భాషకే పరిమితమై గిరిగీసుకుని కూర్చోవాలని లేదు అంటూ తమిళ నిర్మాతలను కూడా ఓ లుక్కయమంటోంది. అలా మొత్తానికి తనను తాను బాగానే ప్రమోట్ చేసుకుంటోందంటున్నారు.


Click it and Unblock the Notifications











