ప్రేక్షకుల గుండెల్లో నెంబర్ వన్ కావాలనే ఇదంతా..

By Nageswara Rao

తెలుగు చిత్రసీమలో 'వాంటెడ్" సినిమాతో హీరోయిన్ అయ్యారు దీక్షాసేథ్. దీక్షాసేథ్ నటించిన తాజా చిత్రం 'వాంటెడ్" ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కూడా తన నటనకు, గ్లామర్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయని ఉబ్బితబ్బిబవుతున్నారు దీక్షాసేథ్. ఇక దీక్షాను మీ టార్గెట్ నంబర్‌వన్ స్థానమే అనుకోవచ్చా...? అని ఓ సందర్భంలో ప్రశ్నించగా "కథానాయికగా నంబర్‌వన్ పోజిషన్ కోసం ప్రయత్నించడం తప్పేమీ కాదు.

అయినా ఇప్పుడున్న హీరోయిన్లతో పోటీని తట్టుకోవడం చాలా కష్టం. అయితే తెలుగు చిత్రసీమలో హీరోయిన్ల మధ్య పోటీ అనేది ఆర్యోగకరంగా వుంటుంది. భవిష్యత్‌లో మంచి మంచి ప్రాజెక్టులు చేసి ప్రేక్షకుల మనసుల్లో నంబర్‌వన్ స్థానాన్ని సంపాందించడమే నా లక్ష్యం" అని ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారు దీక్షాసేథ్. అంతేకాదు హిట్టొస్తే పొంగిపోను..ఫ్లాపొస్తే కృంగిపోను..రెండింటినీ సమానంగా రిసీవ్ చేసుకుంటానని, ఫ్లాపొస్తే ఎక్కడతప్పు చేశానో చూసుకుంటాననీ, హిట్టొస్తే ఇంకా పెద్ద సక్సెస్ ఎలా కొట్టాలో ఆలోచిస్తానని కూడా చెప్పారు దీక్షాసేథ్.

రవితేజ సరసన మిరపకాయ్ సినిమాలో తన అందాలను బాగా ప్రదర్శించారు. ఇది మాత్రమే కాకుండా వాంటెడ్ సినిమాలో సోలో హీరోయిన్‌గా తను మాత్రం మంచి మార్కులనే కొట్టేసిందని సినీవర్గాల సమాచారం. నటన మరియు అందంతో ఎలాగైనా సరే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొవాలనేదే తన తాపత్రయం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X