రామ్ చరణ్ నాకు క్లాస్ మేట్..క్లోజ్
నేను రామ్ చరణ్ కి బాగా క్లోజ్ అంటున్నారు రానా. మేమిద్దరం ఒకే స్కూల్లో పద్మా శేషాద్రి ..చెన్నైలో చదువుకున్నాం.స్కూల్లో ఒకే డెస్క్ లో కూర్చునే వాళ్ళం. ఇద్దరూ నోట్స్లు మార్చుకునేవాళ్ళం.మేమిద్దరం చాలాకాలంగా స్నేహాన్ని కొనసాగిస్తున్నాం అంటున్నారు రానా.ప్రెండ్షిప్ డే సందర్భంగా మీడియాతో రానా ఇలా స్పందించారు. అలాగే మా స్నేహితులతో నేను చాలా సంతోషంగా గడుపుతాను అంటూ చెప్పుకొచ్చారు.రానా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ చిత్రంలో చేస్తున్నారు.అలాగే ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న నా ఇష్టం చిత్రం కూడా చేస్తున్నారు.సింహా నిర్మాతలు నిర్మించే ఈ చిత్రం రీసెంట్ గా మలేషియా షెడ్యూల్ పూర్తిచేసుకువచ్చింది.జెనిలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామిడీ గా రూపొందుతోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నారు.సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











