న్యూ కమర్స్‌తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అంటున్న ఆరంజ్ బేబి..
''కొన్నేళ్ల క్రితం నేను కూడా కొత్త ఆర్టిస్ట్‌నే. అప్పుడు నాకు అవకాశాలు ఇచ్చి ఉండకపోతే ఇవాళ నేనీ స్థాయికి వచ్చి ఉండేదాన్ని కాదు. గతాన్ని గుర్తుంచుకుంటాను కాబట్టే న్యూ కమర్స్‌తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను"" అంటున్నారు జెనీలియా. ఇప్పుడు మీరు స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నారు కదా. ఇక మీకు తిరుగు లేదనే ఫీలింగ్‌లో ఉన్నారా? అని ఈ క్యూట్ గాళ్‌ని అడిగితే - ''స్టార్ హీరోయిన్ అని అందరూ అంటున్నారు కానీ నేను మాత్రం అలా ఫీలవ్వడంలేదు. నటిగా విజయాలు సాధిస్తున్నాను. అందుకు ఆనందంగా ఉంది. కానీ ఆ విజయాలను మనసుతో ఆస్వాదిస్తున్నాను. నెత్తికి మాత్రం ఎక్కించుకోవడం లేదు. ఒకవేళ ఇక మనకు తిరుగు లేదని పొగరుతో ప్రవర్తించాననుకోండి.. ఆ క్షణం నుంచి నా అపజయం ఆరంభం అవుతుందనే భయం ఉంది. అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటున్నాను.
ఒక నటిగా ఇప్పటివరకు ఎత్తు, పల్లాలు చాలానే చూశాను. ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు సహనం పాటించాను. ఆ సహనమే నన్నీ స్థాయికి తెచ్చింది. ఇప్పటికీ ప్రతి సినిమాని కొత్త సినిమాలా భావించి చేస్తాను"" అన్నారు. ఇప్పటివరకు క్యూట్ గాళ్‌గా చాలా పాత్రలు చేశారు. మరి.. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? అని జెనీలియాని అడిగితే - ''నేను చేసే ప్రతి పాత్రనూ నా డ్రీమ్ రోల్‌గానే భావిస్తాను. ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ నాకు సంతృప్తినిచ్చాయి. మున్ముందు కూడా ఆ తరహా పాత్రలనే ఎన్నుకుంటాను. కథానాయికలు గ్లామర్‌గా ఉండాలి కాబట్టి.. ఆ విధంగా కనిపించడానికి అభ్యంతరం లేదు.
కానీ సినిమా మొత్తంలో కనీసం ఆరేడు సన్నివేశాల్లో అయినా నటనకు అవకాశం ఉండాలని కోరుకుంటాను. లక్కీగా ఇప్పటివరకు చేసినే పాత్రల్లో నాకా స్కోప్ లభించింది"" అన్నారు. టాలీవుడ్ గురించి చెబుతూ - ''ఇతర భాషలకన్నా నా ప్రతిభను ఎక్కువ నమ్మింది తెలుగు పరిశ్రమే. మంచి మంచి పాత్రలు ఇచ్చి నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాతే నన్ను ఇతర భాషలవారు గుర్తించారు. కాబట్టి తెలుగు పరిశ్రమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది"" అన్నారు జెనీలియా.


Click it and Unblock the Notifications











