నాగచైతన్యను చూస్తుంటే అసూయగా ఉంది.. అన్నీ ఆయనకేనా.. నాని
Recommended Video

క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ.ఎస్, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా..

దాసుగారిని మిస్ అవుతున్నాను
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్‌కి రావడానికి రెండు కారణాలు.. మారుతి, టీమ్ అందరూ ఒక కారణమైతే..రెండో కారణం, నాగార్జునగారితో దేవదాస్ షూటింగ్ అయిపోయింది. దాసుగారిని దేవాగా మిస్ అయ్యానని వచ్చాను. ఇక సినిమా విషయానికి వస్తే.. చైతన్యను చూసి అసూయగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎంత ఎంజాయ్ చేసుంటాడో నాకు అర్థమవుతుంది.

మారుతి తొమ్మిది నెలలుగా
దర్శకుడు మారుతిగారు ఎంటర్‌టైనింగ్ పర్సన్. అలాంటి వ్యక్తి ఆరు నుండి తొమ్మిది నెలలు ఓ సినిమాపై వర్క్ చేశాడంటే సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నిర్మాత నాగవంశీ.. నా క్లాస్‌మేట్. నేను, చైతన్య దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం.

చైతూకే బెస్ట్ సాంగ్స్
ఇంతకు ముందు జనరేషన్‌లో బెస్ట్ సాంగ్స్ అన్ని నాగార్జునగారికి పడితే.. ఈ జనరేషన్‌లో బెస్ట్ సాంగ్స్ అన్ని చైతన్యకే పడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మంచి పాటలు రాసి పెట్టి ఉన్నాయోమో.. ఈ సినిమాలో కూడా పాటలు చాలా బావున్నాయి. టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. అల్లరి అల్లుడులాంటి సినిమా అని నాగార్జునగారు అన్నారు. ఆయన అలా అన్నారంటే సినిమా ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చు.
నా మజ్నుగా అను ఇమ్మాన్యుయేల్
ఇక అనుఇమ్మాన్యుయేల్ నా మజ్నుతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని నాని అన్నారు.


Click it and Unblock the Notifications











