తప్పుడు వార్తే... ‘బహుబలి’ తర్వాతి సినిమాపై రాజమౌళి
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బహుబలి' తర్వాత డైరెక్ట్ తమిళ సినిమా చేయబోతున్నారని, తమిళ హీరో ప్రశాంత్‌తో ఈచిత్రం ఉంటుందనే కోలీవుడ్లో వార్తలు రావడంపై రాజమౌళి స్పందించారు. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కావడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా విస్మయం వ్యక్తం చేసారు.
బహుబలి సినిమా విషయానికొస్తే...
మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.
ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు.


Click it and Unblock the Notifications











