క్షమించండి అంటూ అక్కినేని అఖిల్ ట్వీట్
హైదరాబాద్: క్షమాపణలు అడిగేంత తప్పు అక్కినేని అప్ కమింగ్ హీరో అఖిల్ ఏమీ చేయలేదు. కానీ క్షమాపణలు అడిగి తన ఆటిట్యూడ్ ఎలాంటిదో నిరూపించుకున్నాడు అఖిల్. ఇంతకీ అఖిల్ ఇలా క్షమాపణలు చెప్పడానికి ప్రధాన కారణం మాట తప్పడమే. ఆ మధ్య 20 రోజుల్లో తన సినిమా గురించి వివరాలు ప్రకటిస్తానని చెప్పిన అఖిల్ నెల రోజులైనా ప్రకటించలేదు.
తను ఆలస్యం చేయడం వల్ల....అక్కినేని అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారన్న విషయం గ్రహించిన అఖిల్.....అపాలజీ చెప్పారు. ''అందరూ నేను ఏం చేబుతానోనని ఎదురుచూస్తున్నారని తెలుసు. నాక్కూడా ఇలా ఆలస్యం చేయడం నచ్చడం లేదు. కానీ సినిమాకి ముందు చేయాల్సిన కసరత్తులు చాలా ఉన్నాయి కదా. వాటి పనుల్లో ఉన్నా. అందుకే ఈ ఆలస్యం. దానికి నేను సారీ చెబుతున్నా" అంటూ అఖిల్ తాజాగా ట్వీట్ చేశాడు.

''కథ పనులు చివరి దశకొచ్చాయి. ఇరవై రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాను. యాక్షన్, ప్రేమ, వినోదం.. ఇలా అన్ని రకాల అంశాలు మేళవించి పక్కా తెలుగు సినిమా సిద్ధం చేస్తున్నాం . మన సినిమాలను పరిశీలిస్తే ఎక్కువ భాగం డ్యాన్స్, ఫైట్స్, ప్రేమ అంశాలున్నవే కనిపిస్తాయి. ప్రేక్షకులకు నచ్చే ఇలాంటి వాణిజ్యపరమైన చిత్రంతోనే రావాలనుకుంటున్నాను. మొదట ప్రేక్షకులకు దగ్గరయ్యాకే వైవిధ్యమైన చిత్రాల వైపు వెళ్తాను'' అంటూ అఖిల్ ఆ మధ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











