‘100% లవ్’ సిడిలను విసిరేసి దేవిశ్రీని దెయ్యం అన్న నాగార్జున...?
గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మాతగా నిర్మించిన చిత్రం '100% లవ్", ఈ చిత్ర ఆడియో సోమవారం హైదరాబాద్ రాక్ గార్డెన్స్ లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. దేవీశ్రీప్రసాద్ అభిమానులను తన పాటలతో ఉర్రూతలూగించగా..దర్శకుడు సుకుమార్ దేవీశ్రీని డెవిల్ అని సంభోదించాడు. తన భాషలో డెవిల్ అంటే 'సంగీత దెయ్యం"అని అర్థమట. ఈ కార్యక్రమానికి నాగచైతన్య హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో 100% లవ్ ఆడియోను నాగార్జున రిలీజ్ చేసి ఆ ఆడియో సిడీని అభిమానుల మీదకు నాగార్జున మాట్లాడుతున్నంత సేపు కేరింతలు కొడుతూనే ఉన్నారు. ఆ జోష్ లో ఉన్న అభిమానులు నాగార్జున మాట్లాడుతున్నంత సేపు కేరింతలు కొడుతూనే ఉన్నారు..మరికొన్ని సిడీలను అభిమానుల మీదకు విసిరి..వారిలో జోష్ ని పెంచి నాగచైతన్య ఫంక్షన్ లో లేని లోటును నాగార్జున తీర్చాడు..


Click it and Unblock the Notifications











