చీర కట్టినా అసభ్యంగా ఫోటోలు తీసి ఆ సైట్లలో పెడుతున్నారు: సింగర్ చిన్మయి
ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు మీద 'మీటూ' సంచలన కామెంట్స్ చేసినప్పటి నుంచి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే... మరికొందరు చిన్మయి తీరును తప్పుబడుతూ ఆమె డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేస్తుండటం తెలిసిందే.
తాజాగా చిన్మయి మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు. ట్విట్టర్లో ఒక వ్యక్తి చిన్మయి గురించి ప్రస్తావిస్తూ... మీ గొంతు చాలా తీయగా ఉంటుంది, మీరు సారీలో చాలా అందంగా ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అతడి ట్వీటుకు చిన్మయి తనదైన శైలిలో స్పందించారు.
మీరు చీరలో చాలా బావుంటారు
చిన్మయి.. మీరు చాలా బాగా పాడుతారు. అందంగా ఉంటారు, బోల్డ్‌గా మాట్లాడతారు. మీలోని ఆత్మవిశ్వాసంతో చాలా మందికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. అయితే మీరు చీరకట్టు లేదా ఇతర భారతీయ వస్త్రధారణలో మరింత లక్షణంగా కనిపిస్తూ ఎంతో మంది భారతీయ అమ్మాయిలకు ఆదర్శంగా ఉంటారు... అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

ఆ ఫోటోలు సాఫ్ట్ పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు
అతడి ట్వీటుకు చిన్మయి స్పందిస్తూ... నేను చీర కట్టినా కొందరు మగాళ్లు నా నడుము, చాతీ భాగాన్ని ఫోటో తీసి సర్కిల్ చేసి... వాటిని సాఫ్ట్ పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ వారి నుంచే నాకు అసభ్య సందేశాలు
నా చీరకట్టు ఫోటోలు సాఫ్ట్ పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేసిన వక్తులే.... వాటిని చూస్తూ తాము ఎలా లైంగిక స్వయం ప్రేరేపణ పొందుతున్నామో చెబుతూ అసభ్య సందేశాలు పంపుతున్నారని చిన్మయి చెప్పుకొచ్చారు.

చీర కట్టినా, జీన్స్ వేసినా నేను భారతీయురాలినే సర్
చీరకట్టినా, జీన్స్ వేసిన నేను భారతీయురాలినే సార్... అంటూ చిన్మయి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. మహిళల వస్త్రధారణ తప్పుబట్టే వ్యక్తులపై విరుచుకుపడే చిన్మయి మరోసారి తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











