»   » షాకింగ్ స్టేట్మెంట్: అతనితో నగ్నంగా ఉంటానన్న దీపిక!

షాకింగ్ స్టేట్మెంట్: అతనితో నగ్నంగా ఉంటానన్న దీపిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ మధ్య లవ్ ఎఫైర్ ఉందని గత కొంత కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని ఎట్టకేలకు అంగీకరించింది దీపిక. రణవీర్ సింగ్‌ను తాను ఎంతగానో లవ్ చేస్తున్నానని, అతన్ని ఎంతగానో గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. అతని ముందు నగ్నంగా ఉండటానికి కూడా సిద్దమని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ తాము నటించిన ‘బాజీరావు మస్తానీ' మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ ఆంగ్లపత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ గురించి దీపిక పదుకోన్ మాట్లాడుతూ...‘అతను నా బెస్ట్ ఫ్రెండ్. నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్...ఈజీగా హర్ట్ అవుతాను. రణబీర్ కపూర్ ముందు నేను నగ్నంగా ఉండటానికి కూడా సిద్ధం. ఎందుకంటే అతను నన్ను హర్ట్ చేయబోడని తెలుసు' అని దీపిక పదుకోన్ చెప్పుకొచ్చింది.

I Can Be So Naked In Front Of Ranveer Singh Says Deepika Padukone

‘మా ఇద్దరి మధ్య ఎంత మంచి అండర్ స్టాండింగ్ ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అందుకే రణబీర్ ను నేను ఎంతో లవ్ చేస్తాను...అతన్ని ఎంతో గౌరవిస్తాను. అందుకే అతని ముందు నగ్నంగా ఉన్నా కంఫర్టుగానే ఫీలవుతాను' అని దీపిక పదుకోన్ చెప్పుకొచ్చారు.

రణవీర్, దీపిక నటిస్తున్న బాజీరావు మస్తానీ సినిమా వివరాల్లోకి వెళితే..
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘బాజీరావు మస్తానీ' మూవీ కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్నఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక బాలీవుడ్ చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా-1‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

I Can Be So Naked In Front Of Ranveer Singh Says Deepika Padukone

బాజీ రావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.... అతని ప్రియురాలు మస్తానీ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తోంది. బాజీరావ్‌ భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్‌ కొత్తగా కనిపించబోతున్నాడు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడేలా ఉండబోతోంది. డిసెంబర్ 18న ఈ సినిమా విడుదలవుతోంది.

English summary
Deepika Padukone has finally confessed that she loves Ranveer Singh and respects him a lot. The Bajirao Mastani actress recently said that she can be so naked in front of Ranveer knowing that he will never hurt her.
Please Wait while comments are loading...