కండోమ్ యాడ్లో నటిస్తానంటూ హీరోయిన్ ఉత్సాహం
ముంబై: ఏ చిన్న అవకాశం దొరికినా తన పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేసే బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి సెక్సీగా రెచ్చిపోయింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన కండోమ్ యాడ్‌కు స్ఫూఫ్ విడుదల చేసి అందరి చూపులు తన అందాలపై పడేలా చేసుకుంది.
రణవీర్ సింగ్ ఇటీవల 'డ్యూరెక్స్' అనే కండోమ్ కంపెనీ యాడ్ ఫిల్మ్‌లో నటించాడు. ఈ యాడ్ ఫిల్మ్‌కు స్పూఫ్‌గా 'డూ ది రెక్స్' పేరుతో తన సెక్సీ ఒంపు సొంపులు ఒలికిస్తూ వీడియో విడుదల చేసింది పూనమ్. ఈ వీడియో విడుదల చేసిన తర్వాత పూనమ్ పాండే హాట్ టాపిక్ అయింది.

వీడియో విడుదలపై పూనమ్ పాండే స్పందిస్తూ....'నా ట్విట్టర్ అభిమానుల కోరిక మేరకే తాను ఆ వీడియో పోస్టు చేసాను. నేను కూడా రణవీర్ సింగ్ మాదిరి కండోమ్ యాడ్స్‌లో నటించగలను. కండోమ్ యాడ్స్ చేయడం వల్ల సమాజానికి ఎలాంటి హాని ఉండదు. పైగా సెక్స్‌కు సంబంధించిన విషయాల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసినట్లు అవుతుంది' అని పూనమ్ తెలిపింది.
ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడం ద్వారా నేను కూడా కండోమ్ యాడ్స్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను...అంటూ కండోమ్ కంపెనీలకు సంకేతాలు పంపింది పూనమ్. కాగా బాలీవుడ్లో కెరీర్ చక్కగా సాగుతున్న తరుణంలోనూ కండోమ్ యాడ్లో నటించిన రణవీర్ సింగ్ చర్యను పూనమ్ పాండే ప్రశంసించింది.


Click it and Unblock the Notifications











