నా గతం తెలిసినా భారతీయులు ఆదరించారు: సన్నీలియోన్
హైదరాబాద్ : ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇప్పుడు అశ్లీల నీలి చిత్రాల్లో నటించడం మానేసి భారతీయ సినీ రంగంపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. షూటౌట్ ఎట్ వాడాలా చిత్రంలో ఐటం సాంగులో నటించిన సన్నీ లియోన్ ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులను కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఆమెకు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. నేను ఈ చిత్రంలో చేసిన ఐటం సాంగుకు మంచి స్పందన రావడం ఎంతో గొప్ప అనుభూతి అని, న్యూస్ పేపర్స్, టెలివిజన్ షోలు, మేగజైన్లు అన్నింటా మంచి రెస్పాన్స్ వస్తోంది అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.
మిమ్మల్ని అభిమానించే వారితో పాటు, మిమ్మల్ని విమర్శించే వారు కూడా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు సన్నీ లియోన్ స్పందిస్తూ....ఎవరి ఒపీనియన్ వారిది. ఏ రంగంలో అయినా ప్రశంసలతో పాటు విమర్శలు ఉంటాయి. పాజిటివ్ అంశాలనే నేను పరిగణలోకి తీసుకుంటాను. కోట్లాది మంది ఉన్న ఈ దేశంలో నన్ను విమర్శించే వారి కంటే అభిమానించే వారే ఎక్కువ. అలాంటప్పుడు నేను ఎందుకు బాధ పడాలి అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.
మీ గత జీవితం వల్లనే మీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయనే విషయం తెలుసా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.....'నేను నా గత జీవితం నుంచి తప్పించుకోలేనని తెలుసు. అలా జరుగాలని కోరుకోవడమూ లేదు. భారత దేశంలోని ప్రజలు నా గతం తెలిసినప్పటికీ నన్ను ఆదరించారు. ఇది ఎంతో గొప్ప విషయం. అమెరికాలో అయితే అలా జరగదు' అని వ్యాఖ్యానించింది.
ఫోర్న్ చిత్రాల వల్లనే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మీరేమంటారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ....'అది వాస్తవం కాదు. ఫోర్న్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కేవలం దాని వల్లనే నేరాలు జరుగుతున్నాయనే వాదనతో నేను ఏకీభవించను. దానికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు' అని సన్నీ లియోన్ వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications












