పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ... తేజ విమర్శలు
తన తొలి సినిమా నుంచి కొత్త నటీనటులతోనే ప్రయోగాలు చేస్తూ చిత్రం, జయం, నువ్వునేను లాంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించిన తేజ తాజాగా...'నీకు నాకు డాష్ డాష్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో నటించేవారంతా కొత్తవాళ్లే కావడం గమనార్హం.
భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రిన్స్, నందిత హీరో హీరోయిన్లగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ఆ మధ్య ప్రకటించినప్పటికీ... తాజాగా ఈ చిత్రం విడుదల ఒకరోజు లేటుగా అంటే ఏప్రిల్ 13కు వాయిదా పడింది. సెన్సార్ బోర్డు నుంచి ఈచిత్రం A సర్టిఫికెట్ పొందింది.
పరుచూరి వెంకటేశ్వరరావు, తీర్థ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రామస్వామి, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వి.కృష్ణకుమారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.


Click it and Unblock the Notifications












