Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
"రాజశేఖర్ ఇబ్బంది పెట్టాడని చెప్పా, చెడ్డవాడని ఎప్పుడూ చెప్పలేదు"
హీరో రాజశేఖర్, ఫిల్మ్‌మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ మధ్య నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం రాజశేఖర్, తమ్మారెడ్డి మధ్య 'వేటగాడు' సినిమా విషయంలో వివాదం నెలకొంది. 'వేటగాడు' సినిమా సమయంలో రాజశేఖర్ సహకరించక పోవడం వల్ల తాను చాలా నష్టపోయానని అప్పట్లో తమ్మారెడ్డి ఆరోపించారు.
చాలా మంది చెప్పినా వినలేదు
రాజశేఖర్‌తో సినిమా చేయవద్దని తనకు చాలా మంది చెప్పారని, అయితే వారి మాట వినకుండా సినిమా చేసి తాను చాలా స్ట్రగుల్ అయ్యానని, అతడు సహకరించక పోవడం వల్లే సినిమా నష్టాల పాలైందని అప్పట్లో తమ్మారెడ్డి అనడం సంచలనం అయింది.
ఇటీవల ఇంటర్వ్యూలో స్పందించిన రాజశేఖర్
అప్పట్లో తమ్మారెడ్డి చేసిన ఆరోపణల ప్రస్తావన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రావడంతో రాజశేఖర్ స్పందించారు. తనకు అప్పట్లో తమ్మారెడ్డి రెమ్యూనరేషన్ ఎగ్గొట్టాడని, అయినా తాను నటించానని రాజశేఖర్ తెలిపారు. అపుడు లొకేషన్‌కు లేటుగా వెళ్లిన మాట నిజమే, అపుడు నా సమస్యలు నాకు ఉన్నాయి. ఆ కారణం చేత సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవుతుందా? అంటూ రాజశేఖర్ ప్రశ్నించారు.
కూల్‌గా స్పందించిన తమ్మారెడ్డి
రాజశేఖర్ ఇటీవల ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి తాజాగా స్పందించారు. అయితే గతంలో మాదిరిగా రాజశేఖర్ మీద కోపంగా మాట్లాడకుండా కూల్ గా రియాక్ట్ అయ్యారు. రాజశేఖర్ మూలంగా ‘వేటగాడు' డిలే అయిన మాట నిజం. కానీ రాజశేఖర్ చెడ్డవాడు అని నేనెప్పుడూ చెప్పలేదు. అతడిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అని తమ్మారెడ్డి తెలిపారు.
రాజశేఖర్ చాలా మంచి వ్యక్తి
పర్సనల్‌గా రాజశేఖర్ చాలా మంచి వ్యక్తి, గ్రేట్ యాక్టర్, అతనిలాంటి నటుడు తెలుగులో మరెవరూ లేరు. ఇటీవల ఆయన చేసిన ‘గరుడవేగ' సినిమా హిట్టయినందుకు కంగ్రాట్స్ చెబుతున్నాను అని తమ్మారెడ్డి కూల్ గా చెప్పారు.
ఎంతో మందికి హెల్ప్ చేశాడు
రాజశేఖర్ ఒక డాక్టర్ గా చాలా మందికి హెల్ప్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆయన వెంటనే వెళ్లి చెక్ చేసేవారు. జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లకు సూచించేవారు. ఈ విషయంలో ఆయన మంచితనాన్ని ఎవరూ కాదనలేరు అని తమ్మారెడ్డి అన్నారు.
ఇబ్బంది పెట్టింది నిజమే
నేను రెమ్యూనరేషన్ విషయంలో రాజశేఖర్‌ను ఇబ్బంది పెట్టిన మాట నిజమే తమ్మారెడ్డి ఒప్పుకున్నారు. రాజశేఖర్ అపుడు తన రెమ్యూనరేషన్ రికవరీ చేసుకునేందుకు సినిమా రిలీజ్ అడ్డుకున్నారు.
ఇప్పటికీ అందని ఫుల్ పేమెంట్
ఇప్పటికీ తమ్మారెడ్డి రాజశేఖర్ కు ఫుల్ పేమెంట్ ఇవ్వలేదట. ఎందుకూ అంటే అతడు సినిమా ఆపడం వల్ల విడుదల ఒక రోజు ఆలస్యం అయింది, అది తనకు మరింత నష్టాన్ని మిగిలిచ్చింది అని తమ్మారెడ్డి వాదన.