రానా.. ఎంతో కాలం ఆగలేను.. మంచు లక్ష్మి.. హరితేజ కూడా ఫిక్స్..

By Rajababu

Recommended Video

రానా.. ఎంతో కాలం ఆగలేను.. మంచు లక్ష్మి

వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రానా దగ్గుబాటి మరోసారి సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు. అదే జోష్‌తో 1945 కాలం నాటి ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నట్టు తాజాగా రానా ట్వీట్ చేశారు. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటల ఆధారంగా తెరకెక్కనున్నట్టు ప్రాథమిక సమాచారం. అయితే రానా చేసిన ట్వీట్‌కు మంచు లక్ష్మీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేమిటంటే..

 రెండో షెడ్యూల్‌లో

రెండో షెడ్యూల్‌లో

1945గా పేర్కొంటున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. రెండో షెడ్యూల్‌ను తాజాగా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రానా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మరోసారి చరిత్రను తిరగరాయబోతున్నాం. 1945 కాలంలోకి తిరిగి వెళ్లిపోతున్నాం. 1945 సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం అని రానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 మంచు లక్ష్మీ ఆసక్తికరమైన ట్వీట్

మంచు లక్ష్మీ ఆసక్తికరమైన ట్వీట్

రానా చేసిన పోస్టుకు సమాధానం ఇస్తూ మంచు లక్ష్మీ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 1945 మూవీ ఎప్పుడెప్పుడూ చూడాలని ఉంది. ఎక్కువ రోజులు ఆగడం కష్టం అనే రీతిలో మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది.

 జెమినీ టీవీలో హరితేజతో కలిసి

జెమినీ టీవీలో హరితేజతో కలిసి

ఇదిలా ఉండగా, మంచు లక్ష్మీ తన జన్మదినాన్ని ఇటీవల జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యక్రమాలను వెల్లడించారు. జెమినీ టీవీలో బిగ్‌బాస్ కంటెస్టంట్ హరితేజతో ఫిదా అనే కార్యక్రమాన్ని చేస్తున్నాను. హరితేజకు చెప్పకుండానే తన షోలో యాంకర్‌గా ఫిక్స్ చేశాను. ఆ తర్వాత మానాన్నతో కలిసి హరితేజను ఒప్పించాం అని చెప్పారు.

ఫిదా ఫస్ట్ ఎపిసోడ్‌లో రకుల్

అలాగే జెమిని టీవీలో ప్రసారం కానున్న ఫిదా కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్‌ ట్రైలర్‌ను మంచు లక్ష్మీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తన తొలి షోలో గెస్ట్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హరితేజ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నట్టు స్పష్టమవుతున్నది. కాగా ఈ కార్యక్రమం అక్టోబర్ 15 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతీ ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X