twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' లో కట్టప్ప సీన్ కాపీనే : రాజమౌళి కాపీలపై వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'బాహుబలి' చిత్రంపై మొదటి పోస్టర్ నుంచీ కాపీ వివాదం వస్తూనే ఉంది. అయితే ఎప్పుడూ రాజమౌళి ఖండించనూ లేదు..సమర్ధించనూ లేదు. తాజాగా ఆయన బాహుబలి చిత్రం ప్రమోషన్ లో భాగంగా టీవి 9 ఎనకౌంటర్ పోగ్రామ్ కు హాజరయ్యారు. అక్కడ ఈ ప్రస్దావన వచ్చినప్పుడు కాపీ విషయమై ఆయన స్పందించారు. ఆయనేం అన్నారో క్రింద చదవండి...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    బాహుబలి సినిమాలో ...కట్టప్ప ఇమేజ్ గుర్తుండిపోయేది..అది కాలు తీసి తల మీద పెట్టుకోవటం...నా చిన్నప్పుడు నేను ఛంగీజ్ ఖాన్ సినిమా చూసాను..అందులో ఓ ఆజానుబాహుడు,గుండున్న వ్యక్తి హీరో కాలు తీసి తల మీద పెట్టుకుంటాడు. అది నాకు గుర్తుండిపోయింది.

    ఆ ఇమేజ్ నాకు బాగా గుర్తుంది. సినిమా ఏమీ గుర్తు లేదు. నాన్నగారితో పది సంవత్సరాల్లో ప్రతీ సినిమా డిస్కషన్ లోనూ ఆ సీన్ పెట్టచ్చా..ఆ సీన్ పెట్టచ్చా అని అడుగుతూనే ఉన్నాను.. ఫైనల్ గా ఇందులో కుదిరింది అనుకోండి.

    నిజంగా నేను ఏదైతే కరెక్టుగా ఇన్ఫూలియన్స్ అయి తీసుకున్నానో... అది మాత్రం ఎవరూ కాపీ కొట్టాను అనలేదు...జనాలకు ఎవరకీ దొరికి ఉండదు అది.

    అలాగే నేను కాపీ కొట్టను అనటం లేదు...నేను కాపీ చేస్తాను..అయితే చేసిన ప్రతీదీ కాపీ కాదు...నేనే షూట్ చేసిన తర్వాత ఈ షాట్ ఫలానా షాట్ లాగ ఉందేంటి అని ఆశ్చర్యపోయిన సందర్బాలూ ఉన్నాయి. అన్నీ కలిసి కాపీ కాదు అంటున్నాను అని చెప్పారు రాజమౌళి.

    SS Rajamouli

    ఇక బాహుబలి @ 500 కోట్లు

    అందరూ అంచనా వేసినట్లుగానే.. 'బాహుబలి'ఐదొందల కోట్ల క్లబ్‌లో చేరింది. గత నెల 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో పాటు బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా 'బాహుబలి' నిలిచింది.

    ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో కొనసాగుతున్న 'బాహుబలి' జైత్రయాత్రలో మరో మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ బాలీవుడ్‌ బాక్సాఫీసు వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది. ఆదివారం నాటికి రూ. 103.51 కోట్లు వసూలు చేసింది.

    బాలీవుడ్‌.. 'బాహుబలి'.. రూ.100కోట్లు..

    'బాహుబలి' చిత్ర రికార్డుల పర్వం కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్‌లలో సరికొత్త రికార్డులను సృష్టించింది. బాలీవుడ్‌లో రూ.100 కోట్ల వసూళ్లు దాటిన ఏకైక డబ్బింగ్‌ చిత్రంగా 'బాహుబలి' నిలిచింది.

    గత ఆదివారంతో ముగిసిన నాలుగో వారం కలెక్షన్‌లతో 'బాహుబలి' రూ.103.51 కోట్లకు చేరిందని బాలీవుడ్‌ సినీ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. చిత్రాన్ని హిందీలో సమర్పించిన ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత నిర్మాత కరణ్‌ జోహార్‌ దర్శకులు రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రం 'బజరంగీ భాయ్‌జాన్‌' థియేటర్లలో ఉన్నా.. 'బాహుబలి'కి కలెక్షన్‌లు తగ్గక పోవడం గమనార్హం.

    మరో ప్రక్క...

    'బాహుబలి' బ్రాండ్‌ విలువని పెంచేందుకు, చిన్న పిల్లల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ఇప్పుడు 'బాహుబలి' బొమ్మల్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ నడిచే చిత్రమిది.

    'బాహుబలి', 'భళ్లాలదేవ', 'దేవసేన', 'శివగామి', 'అవంతిక'.. ఇలా ఒకొక్క పాత్రకూ ఒక్కో విశిష్టత ఉంది. ఆపాత్రల్ని పోలిన బొమ్మల్ని రూపొందించి, త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

    వాటితోపాటు 'బాహుబలి' వీడియో గేమ్స్‌నీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని అంతర్జాతీయ సంస్థలతో 'బాహుబలి' చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోంది. హాలీవుడ్‌లో 'స్పైడర్‌మేన్‌', 'సూపర్‌మేన్‌' సిరీస్‌ సినిమాలు విడుదల చేసే సమయంలో ఆ పాత్రల్ని పోలిన బొమ్మలు, వీడియో గేమ్స్‌, కొన్ని వినియోగ వస్తువులు మార్కెట్‌లో విడుదల చేస్తుంటారు.

    అటు ప్రచారం, ఇటు వ్యాపారం రెండూ జరిగిపోతుంటాయి. అదే వ్యూహాన్ని 'బాహుబలి' కోసం అనుసరిస్తున్నారు రాజమౌళి. వచ్చే ఏడాది జనవరిలోగా ఈ బొమ్మలు మార్కెట్‌లోకి వస్తాయి.

    English summary
    In an interview with TV 9 , when Rajamouli was asked if he copies scenes from others, the director said, “I’ve copied scenes and shots from other sources; however, not everything I have done in a copy of others. Sometimes, when I shoot a scene, I’m surprised that my work resembles something which I had seen a long time ago. When you grow up watching films from various countries, there are moments and scenes which remain ingrained in your memory and subconsciously I end up emulating or using such scenes in my films.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X