twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలపై హీరో వెంకీ సంచలన వ్యాఖ్యలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, విక్టరీ వెంకటేష్ రాజకీయాల గురించి సంచలన కామెంట్ చేసారు. సినిమా వాళ్లంతా ఇక్కడ కెరీర్ తుది దశకు చేరుకున్నాక రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతుంటే....వెంకటేష్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నారు.

    ఇటీవల ఓ సందర్భంలో ఆయన్ను..మీకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నింకగా ఆసక్తికరంగా స్పందించారు. రాజకీయాలు నాకు అస్సలు సూట్ కావని, రాజకీయాలంటే నిజమైన అర్థం తనకు తెలియదని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

    'నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో మనం అనుకున్నది చేయాలనుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న పరస్థితుల్లో అలాంటి వారు రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మంది బ్యాడ్ అయ్యారు. అలాంటి దారిలోకి నేను వెళ్ల దలుచుకోలేదు' అంటూ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేసారు.

    అయితే ప్రజస్వామ్య వ్యవస్థలో భాగమైన రాజకీయాలు, రాజకీయ నాయకులు అంటే తనకు ఎప్పటికీ గౌరవమే అని వెంకటేష్ వ్యాఖ్యానించారు. మరి వెంకటేష్ వ్యాఖ్యల వెనక ఎలాంటి పరామార్థం ఉందో, ఆయన వ్యాఖ్యలు సినిమా పరిశ్రమలో ఎవరికి వర్తిస్తాయో మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది!

    English summary
    ‘In fact, politics never attracted me. This is not my zone because I could never understand the real meaning of politics. There is too much of power and less of honesty, clarity on objective in today’s politics. Even if you are honest, it is never really so easy to do what you want.' Venkatesh told
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X