మగధీర హిందీలో ఎందుకు చేయలేదంటే...రాజమౌళి
రాజమౌళి తనకి హిందీలో చిత్రాలు చేయాలని ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు. అలాగే మగధీరని హిందీలో ప్లాన్ చేద్దామని హృతిక్ రోషన్ ని అడిగామని, అయితే తాను అప్పటికే జోధా అక్బర్ చేసి ఉన్నానని చెప్పటంతో విరమించుకున్నామన్నారు. అలాగే తన హిందీ తెరంగ్రేటం తనకు నచ్చినట్లుగా చేయాలని ఉందని,అవకాశం వచ్చిందని ఏదో ఒకటి చేయనని స్పష్టం చేసారు. అలాగే తను తమిళ,తెలుగు లలో ఒకేసారి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నానని,ఎందుకంటే నా చిత్రాలు భారీ బడ్జెట్ తో లావిష్ గా ఉంటాయి కదా అన్నారు. అలాగే తన తదుపరి చిత్రం మహేష్ తోనా ప్రబాస్ తోనా అంటే ప్రస్తుతం తన దృష్టి మొత్తం మర్యాద రామన్న మీద ఉందని తేల్చి చెప్పారు.
రాజమౌళి మగధీర మహేష్ బాబు ప్రభాస్ మర్యాద రామన్న రామ్ చరణ్ హృతిక్ రోషన్ జోధా అక్బర్ rajamouli maghadheera mahesh babu maryada ramanna prabhas jodha akbar


Click it and Unblock the Notifications