Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షారుక్ చెంప చెల్లుమనిపించేదాన్ని: జయా బచ్చన్ కోపానికి కారణమేంటి?
షారుక్ చెంప చెల్లుమనిపించేదాన్ని అంటూ జయా బచ్చన్ కామెంట్ చేశారు. జయా బచ్చన్ కోపానికి కారణం ఐశ్వర్య గురించి షారుక్ నోరు జారడమే.
బాలీవుడ్ సినీయర్ స్టార్ జయా బచ్చన్ తన మైండ్‌లో ఏది ఉంటే అది నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఒక్కోసారి ఎదుటి వ్యక్తి ఎంతటి స్టార్ అయినా పట్టించుకోకుండా షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆమె షారుక్ ఖాన్ మీద చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ పరిశ్రమ నివ్వెరపోయింది.
ఆ సమయంలో షారుక్ ఖాన్ తన చేతికి దొరికి ఉంటే చెంప చెల్లుమనిపించేదాన్ని అంటూ...ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయా బచ్చన్ కామెంట్ చేశారు. మరి షారుక్ అంత పెద్ద తప్పు ఏం చేశారు? జయా బచ్చన్ కోపానికి కారణం ఏమిటి? అనేది చూద్దాం...
కోడలు ఐశ్వర్యపై కామెంట్స్
గతంలో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ ప్రేమించుకున్నారు. విడిపోయే ముందు చాలా గొడవ పడ్డారు. తర్వాత ఐశ్వర్యరాయ్ అభిషేక్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఓ సారి సల్మాన్ ఖాన్ గొడవలో షారుక్ ఐశ్వర్య ప్రస్తావన తేవడం, కామెంట్స్ చేయడం.... జయా బచ్చన్ ఆగ్రహానికి కారణం.
Recommended Video
చెంప చెల్లుమనిపించేదాన్ని
నా కోడలు ఐశ్వర్యపై కామెంట్లు చేసిన తర్వాత షారుక్ తమ ఇంటికి వచ్చి ఉంటే చెంప చెళ్లుమనిపించేదాన్ని అని జయా బచ్చన్ చెప్పారు. ఆ విషయం గురించి షారూక్‌తో మాట్లాడే అవకాశం తనకు రాలేదని, ఏదో ఒక రోజు దాని గురించి షారూక్‌తో మాట్లాడతానని చెప్పారు.
సొంతకొడుకులా భావించాను
తన సొంత కొడుకులాగానే షారూక్‌ను చూసుకుంటానని, తమది ఆత్మబంధమని.... ఈ సందర్భంగా జయా బచ్చన్ వ్యాఖ్యానించడం గమానర్హం.
ఈ గొడవ ఎప్పుడు జరిగింది?
సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలో ఈ గొడవ జరిగింది. ఈ బర్త్ డే పార్టీకి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత చాలా కాలం పాటు షారుక్, సల్మాన్ మాట్లాడుకోలేదు.
గొడవకు కారణం?
కత్రినా బర్త్ డే వేడుకలో షారూక్ చేస్తున్న పాంచ్వీ పాస్ అనే టీవీ షో గురించి సల్మాన్ ఖాన్ నెగెటివ్ కామెంట్స్ చేశాడు. తన దస్ కా దమ్ అనే కార్యక్రమాన్ని కాపీకొట్టి చేస్తున్నారని, అదో పెద్ద ప్లాప్ షో అంటూ సల్మాన్ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే గొడవ పెద్దది అయింది.
ఐశ్వర్యరాయ్‌ని లాగడంతో సీరియస్
సల్మాన్ ఖాన్‌తో గొడవ పడిన షారుక్... ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ ప్రస్తావన తేవడంతో ఈ ఇష్యూ కాస్త సీరియస్ అయింది. ఇదే జయా బచ్చన్ కోపానికి కారణం అయింది.
ఐశ్వర్యరాయ్‌ని కోడలుగా చేసుకోవడంపై
సంస్కారం, సంప్రదాయం కలిగిన అమ్మాయినే అభిషేక్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఐశ్వర్యరాయ్ రూపంలో నేను అనుకున్న అమ్మాయి దొరికింది. ఐష్ మానవ విలువలు తెలిసిన అమ్మాయి అని జయా బచ్చన్ తెలిపారు.
కరిష్మాతో వివాహం రద్దుపై
ఐశ్వర్యరాయ్ కంటే ముందు అభిషేక్ బచ్చన్ వివాహం కరిష్మా కపూర్‌తో ఫిక్స్ అయింది. అయితే అనుకోని కారణాలతో అది రద్దయింది. దీనిపై కూడా జయా బచ్చన్ స్పందించారు.
బ్లేమ్ చేయడం ఇష్టం లేదు
కరిష్మా కపూర్ సంప్రదాయబద్ధమైన కుటుంబం నుండి వచ్చింది. తన భర్త అమితాబ్‌తో ఆమె తండ్రికి మంచి అబంధం ఉంది. ఇలాంటి సందర్భంలో ఎవరూ ఓ కుటుంబాన్ని బ్లేమ్ చేయ కూడదు అంటూ ఆ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు జయా బచ్చన్.