'కెవ్వు కేక' పాట ఫెయిల్యూర్ అంటూ ఆమె..
పవన్ 'గబ్బర్ సింగ్' చిత్రం గురించి మాట్లాడితే మొదట 'కెవ్వు కేక'పాట గురించే అందరూ ప్రస్దావిస్తున్న సంగతి తెలిసిందే. ఆడియో విడుదలైన వెంటనే... వింటానికే ఇంత కిక్కు ఇస్తోంది. ఇక చూస్తే ఎంత అదిరిపోతుందో అంటూ అందరూ చాలా ఎక్సపెక్ట్ చేసారు. అయితే సినిమాలో మలైకా అరోరా ఆ రేంజి కిక్ ని ఇవ్వలేకపోయిందనేది వాస్తవం. ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ ఆడియో పంక్షన్ లో స్టేజిపై 'కెవ్వు కేక'పాటకు డాన్స్ చేసిన జరీనా ఓ టీవీ ఛానెల్ తో ఈ విషయమై మాట్లాడింది.
జరీనా మాట్లాడుతూ...పాటకు తగ్గట్లుగా డాన్స్ లేదని,ఆమె కన్నా తనే బాగా చేసానని చెప్పుకొచ్చింది. తాను ఆంధ్రా అమ్మాయిని కావటం వల్లనో మరేమో కానీ అటువంటి ఆఫర్స్ రావటం లేదని వాపోయింది. తను స్టేజ్ మీద చేసిన డాన్స్ కు,తెరపైన చేసిన డాన్స్ కు తేడా చూడాలని,ఈ ఒక్క ఎగ్జాంపుల్ వల్ల అందరూ ముంబై గర్ల్ కన్నా ఆంధ్రా గర్ల్ బెటర్ అని అంది. నేను ఆమె నుంచి ఆ పాటలో చాలా ఎక్సపెక్ట్ చేసాను. ఎందుకంటే అది చాలా మంచి సాంగ్...దాని ఆడియో చూస్తేనే సూపర్ హిట్...వీడియో కూడా అలాగే ఉంటుందని ఎక్సపెక్టేషన్స్ చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇక ఆ ఛానెల్ వారు స్టేజిపై జరీనా చేసిందీ,సినిమాలో మలైకా చేసింది కంపేర్ చేస్తూ చూపారు.
ఇక గబ్బర్ సింగ్ ఒరిజనల్ దబాంగ్ లో ఆమె చేసిన 'మున్నీ బదనాం హుయే' పాట పెద్ద హిట్ గా మారింది. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ ఐటం సాంగు ఉంటుందని, అందుకే ఈ పాట కోసం మలైకా అరోరాను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ పాటకోసం చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ని చూసినా చివరకు ఆమెనే ఫైనల్ చేసారు. అలాగే రాజమౌళి సైతం కెవ్వు కేక పాటకు నిరాశ చెందినట్లు ట్వీట్ చేయటం వార్తల్లో నిలిచింది. ఈ పాట నిమిత్తం మలైకాకు కోటి రూపాయలు వరకూ పే చేసారని అప్పట్లో వినపడింది.
మలైకా మాత్రం కెవ్వు కేక పాట షూట్ జరిగినప్పడు తన అనుభవాలను మలైకా మీడియాతో పంచుకుంది. ఆమె ..పవన్ ని దేముడు అంటోంది. అతను ఎక్సట్రీమ్లీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. తను డాన్స్ చేయటానికి వచ్చినప్పుడు ఢిఫెరెంట్ గా ఉంటాడు అనుకన్నాను కానీ ఇంత అవుట్ స్టాండింగ్ ఫెరఫార్మెన్స్ ఇస్తాడనుకోలేదు అంది. ఇక ఈ పాట గురించి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దబాంగ్ మా సొంత ప్రొడక్షన్ చిత్రం. దాని రీమేక్ లో నేను చేసిన పాట మళ్లీ నేనే చెయ్యటం చాలా ఆనందకరమైన విషయం. నిర్మాత గణేష్ బాబు నన్ను చాలా కేర్ గా చూసుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ సెట్స్ పై చాలా కంపర్ట్ గా నన్ను ఉంచారు అంటూ మెచ్చుకొంది.


Click it and Unblock the Notifications











