గ్రేట్ హ్యూమన్ అంటూ... పవన్‌కు అంకితమిచ్చిన త్రివిక్రమ్
హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలు అర్థం చేసుకున్న వ్యక్తి. అదే విధంగా త్రివిక్రమ్ అంటే కూడా పవన్ కళ్యాన్‌కు బాగా నమ్మకం, అభిమానం. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జల్సా', 'అత్తారింటికి దారేది' లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.
ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ అందరితోనూ కలివిగా, సన్నిహితంగా ఉంటారు. అది ఆయన మంచి తనం అంటుంటారు అంతా. కానీ అభ్యుదయ భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంతో ఇతర సినీ తారలు పొసగలేక పోతున్నారు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. పవన్ కళ్యాణ్ గురించి బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఇద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ సంస్థ కూడా స్థాపించాలని నిర్ణయించుకున్నారంటే ఇద్దరి మధ్య రిలేషన్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా....ఇటీవల 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌కు 'అత్తారింటికి దారేది' చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని ఆశించారు. కానీ దక్కలేదు. అయితే ఇదే చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ అవార్డు అందుకున్న సందర్బంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ....'ఈ అవార్డును నా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్‌కు అంకిత ఇస్తున్నాను. అతను ఒక గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. నాకు ఈ అవార్డు వచ్చిందంటే సినిమాలో ఆయన కృషి కూడా ఎంతో ఉంది' అని త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాటల మాంత్రికుడిగా పేరు ఉంది. ఈ అవార్డుల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పిన మాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్‌కు తన అవార్డు అంకితమిస్తున్నానని చెప్పగానే చప్పట్ల వర్షం కురిసింది.


Click it and Unblock the Notifications











