»   » అక్కినేనికి అంకితమంటూ అల్లు అర్జున్ ప్రకటన

అక్కినేనికి అంకితమంటూ అల్లు అర్జున్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 62వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించి తెలుగు సినిమా విభాగానికి సంబంధించి విజేతల వివరాలు ప్రకటించిన సంగతితెలిసిందే. రేసుగుర్రం లో ఉత్తమ నటనటుకు గానూ అల్లు అర్జున్ కు ఫిల్మ్ ఫేర్ అవార్జుని దక్కించుకున్నాడు. రేసుగుర్రం చిత్రం 3 అవార్డులను దక్కించుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అవార్డుని...అక్కినేని కి అంకితమంటూ ప్రకటించారు. ఆయన ఏమన్నారో ట్వీట్ లో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రతి ఏడాది సౌత్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా చెన్నైలో ఈ వేడుక నిర్వహించారు. జూన్ 26న చెన్నైలోని ఇండోర్ స్టేడింయలో 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది.

అల్లు అర్జున్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...

అల్లు అర్జున్ త్వరలో బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అందులో రకుల్ ప్రీతి సింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘రకుల్ ప్రీత్ సింగ్ బోయపాటి-అల్లు అర్జున్ ప్రాజెక్టుకు లీడ్ హీరోయిన్ గా ఓకే అయింది, ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, జులైలో సినిమా ప్రారంభం అవుతుంది' అని బోయపాటి సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాట.

I dedicate my Best Actor Award to ANR garu: Allu Arjun

ఈ చిత్రాన్ని బోయపాటి తనదైన శైలిలో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ హోం బేనర్ గీతాఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నారు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బిజీగా గడుపుతోంది. ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జాయిన్ కాబోతోంది. అమ్మడికి మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది.

English summary
Allu Arjun tweeted :" I thank the entire cast n crew of RG for their support ! Sply dir Suri ! I dedicate this to our legendary ANR Garu"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu