'లీడర్' భామ కిక్ భాక్సింగ్ ప్రాక్టీస్ ఎవరని కుమ్మటానికో...
'లీడర్' ఫేం రిచా గంగోపాధ్యాయ ..ప్రతిరోజూ రెండు గంటల పాటు 'కిక్ బాక్సింగ్' ప్రాక్టీస్ చేస్తోంది. ఆ విషయం గురించి రీసెంట్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. దాంతో కావాలనే రిచా...ఇలా తనకు కిక్ భాక్సింగ్ తెలుసు అని ఎవరకయినా వార్నింగ్ ఇవ్వటానికే ఆ మెసేజ్ అన్న సందేహం చాలా మందికి కలిగింది. అయితే ..రిచా తెలివిగా "నేను రెగ్యులర్ గా కిక్ బాక్సింగ్ చేస్తున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాను. ఏ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తున్నారని చాలామంది అడిగారు. ఆ ప్రశ్న విని నవ్వొచ్చింది. ఫిట్‌నెస్ కోసమే నేను కిక్ బాక్సింగ్ చేస్తున్నాను.
అంతేకానీ కొంతమంది ఊహించుకుంటున్నట్లు సినిమా కోసం కాదు. మీకో విషయం చెప్పనా..? కేలరీలు ఇట్టే కరిగిపోవాలంటే బాక్సింగ్‌కి మించిన మంచి ఆయుధం లేదు. ప్రతి రోజూ దాదాపు 2 గంటలసేపు బాక్సింగ్ చేస్తాను. ఒక్కోసారి గంటతో సరిపెడతాననుకోండి. నాకు తెలిసి రెండు గంటల శ్రమకు 800 కేలరీలు కరిగిపోతాయ్' అంది రిచా. అయితే ఇలా ఎన్ని చెప్పినా జనం నమ్మేటట్లు కనపడటం లేదు. నా జోలికి వస్తే కుమ్మేసే కెపాసిటి ఉందనే రిచా ఇలా ఇండైరక్ట్ గా వార్నింగ్ లు ఇస్తోందని తమ అనుభవంతో చెప్తున్నార సినీ జనం. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











