నేను వాళ్లని కొట్టలేదు...నవదీప్ వివరణ
తెలుగు హీరో నవదీప్ రీసెంట్ గా మరో కొంతమంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కొట్టారంటూ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయన ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ...మొదట అందరూ ఆమెను నా గర్ల్ ప్రెండ్ అంటున్నారు. అది తప్పు. ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే. మేము నలుగురం స్నేహితులం కలిసి నొవోటెల్ హోటల్ లో డిన్నర్ చేస్తున్నాం.అప్పుడు ఈవ్ టీజింగ్ జరిగింది.అయితే నేను ఫోన్ మాట్లాడటానికి ప్రక్కకు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. నేను వచ్చి చూసేసరికి నా స్నేహితులు చాలా అప్ సెట్ గా ఉన్నారు. దాంతో నేను వారిని నేను ప్రశ్నిస్తే విషయం తెలిసింది.వెంటనే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిపై కేసులు పెట్టాము. అంతే తప్ప నేను ఎవరినీ కొట్టలేదు..తిట్టలేదు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉండటంతో వాళ్లు ఈ రకమైన మీడియాతో మాట్లాడి వివాదం చేస్తున్నారు.దానికి మెయిన్ కారణం నేను సెలబ్రేటిని కావటమే.ఇప్పుడు ఈ విషయమై ఇన్విస్టిగేషన్ జరుగుతోంది..చట్టం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అన్నారు. ఇక
నవదీప్‌పై బంజారాహిల్సు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నవదీప్ నోవాటెల్ హోటల్లో తాగిన మైకంలో ఇంజనీరింగ్ విద్యార్థులపై దాడి చేశారు. అమ్మాయిలతో కలిసి నవదీప్ వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవదీప్‌తో పాటు మరో ఇద్దరి పైనా కేసు నమోదు చేశారు. కేసును మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ పిఎస్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు చెప్పారు. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో హోటల్‌లోని ఐస్ క్రీం పార్లర్ వద్ద ఐస్ క్రీం తింటున్న విద్యార్థుల వద్దకు ఓ అమ్మాయితో పాటు వెళ్లి దాడి చేశాడు. వారి చేతులో ఉన్న సెల్ ఫోన్లు ధ్వంసం చేశాడు. పిఎస్‌లో నేను ఏం చెప్పినా చెల్లుతుందని, పోలీసులు తన వాళ్లే అని చెబుతూ తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











