"మీరు మాట్లాడేది బూతులు కానప్పుడు నాదీ కాదు.... నాని మీద పగ లేదు’’

By Bojja Kumar

Recommended Video

Sanjana Anne Responds To Nani's Tweet

బిగ్ బాస్ రెండో సీజన్‌లో తొలివారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సంజన అన్నె.... షో హోస్ట్ హీరో నానిపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. గత సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఐఫోన్ లాంటివాడైతే, నాని మామూలు ఫోన్ లాంటి వాడంటూ వ్యాఖ్యానించడం.... దానికి నాని ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై స్పందించారు. నానిని కించపరచలేదని, ఎన్టీఆర్ అంటే తనకు పిచ్చి అని... తన అభిప్రాయం చెప్పాను అన్నారు.

నానిని కించపరచలేదు

నానిని కించపరచలేదు

మొదటి సీజన్లో ఎన్టీఆర్‌ను చూసీ చూసీ ఒకరేంజిలో అలవాటు పడిపోయాం. బిగ్ బాస్ 1 నుండి ఆయన ఎప్పుడు వస్తారనే ఎగ్జైట్మెంటుతో కొన్ని కోట్ల మంది ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అలా నాని కోసం నేను ఎదురు చూడలేదు. ఏదైనా కానివ్వండి... నేను ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అయుండొచ్చు. ఐఫోన్ వాడే వారికి మామలూ ఫోన్ ఎక్కదు, అలాగే నాని నాకు ఎక్కలేదేమో? అని మాత్రమే అన్నాను. నానిని కించపరుస్తూ మాట్లాడలేదు.

 నాని అపార్దం చేసుకుంటే నేనేమీ చేయలేను

నాని అపార్దం చేసుకుంటే నేనేమీ చేయలేను

నాని స్టైల్ వేరు, ఎన్టీఆర్ స్టైల్ వేరు. వారిద్దరినీ కంపేర్ చేయలేమని చెప్పానే తప్ప....ఆయన్ను కించపరుస్తూ ఎక్కడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో కొందరు అలా పెట్టి హడావుడి చేస్తున్నారే తప్ప ఇందులో నిజం లేదు. నాని చేసిన ట్వీట్ మీద సంజన స్పందిస్తూ.... నాని అలా అపార్దం చేసుకుంటే నేనేమీ చేయలేను, ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అనుకుంటే అనుకోనివ్వండి. నాకు ఎన్టీఆర్, బాలయ్య బాబు అంటే పిచ్చి, జనాలు ఏమనుకున్నా ఫర్వాలేదు అని సంజన అన్నారు.

నాని మీద కోపం, పగ లేదు

నాని మీద కోపం, పగ లేదు

ఈ సీజన్లో ఎన్టీఆర్ ఉంటారని అనుకున్నాను, కానీ నాని ఉన్నారు. ఆయన ఉంటే బావుండు అనుకున్నాను అని సంజన తెలిపారు. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అక్కడే కలిగిందా? అని యాంకర్ ప్రశ్నించగా....సంజన స్పందిస్తూ... అలాంటిదేమీ లేదు, నాని కేవలం హోస్టింగ్ చేస్తున్నారు. నన్ను తీసేయడానికి కానీ, ఇంకేదో చేయడానికి ఏమీ లేదు. ఆయనకు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతారే తప్ప ఆయనకు నా మీద... నాకు ఆయన మీద పగ, కోపం ఎందుకు? అని సంజన అన్నారు.

నేను మాట్లాడితే బూతు అంటే ఎలా?

నేను మాట్లాడితే బూతు అంటే ఎలా?

ఒకరిని కించ పరిచేలా మాట్లాడాలని నాకు బిగ్ బాస్ చెప్పలేదు. ఎవరినీ డామినేట్ చేయాలని చెప్పలేదు. ఇతర ఇంటి సభ్యులకు కూడా అలా చెప్పలేదని నా ఉద్దేశ్యం. ఒక వేళ చెప్పుంటే అది గేమ్ అయుండొచ్చు. మీరు చేసింది గేమ్ అయినపుడు నేను చేసింది కూడా గేమ్ అని ఫీలవ్వాలి. మీరు మాట్లాడితే బూతు కానప్పుడు... నేను మాట్లాడితే దాన్ని బూతు అంటే ఎలా?... అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యుల తీరుపై తనదైన రీతిలో పైర్ అయ్యారు సంజన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X