ఏదీ మిస్ కాలేదంటున్న రాశి, రీ ఎంట్రీకి రెడీ

పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్, కమర్షియల్ మాత్రమే కాకుండా అన్ని విధాలుగా మెప్పించేలా ఉండాలని చెబుతోంది. త్వరలో తాను ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో మీ ముందుకు వస్తున్నానని సినీ అభిమానులను ఊరిస్తోంది. తాను మంచి భర్తను పొందానని, ఆయన లేకపోతే జీవితం ఇంత హ్యాపీగా ఉండేది కాదేమోనని చెప్పింది. తన జీవితం ఫుల్ ఫిల్ అయిందనే ఫీలింగ్ తనలో ఉందని, తాను జీవితంలో ఏమీ మిస్ కాలేదని చెబుతోంది.
రాశి చివరిసారిగా మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం చిత్రంలో విలన్‌గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది. కాగా గతంలో తన భర్త నివాస్‌ను దర్శకుడిగా నిలబెట్టాలని 'మహా రాజశ్రీ' అనే సినిమాని తీసి నిర్మాతగా అపజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరోసారి నిర్మాతగా, తన భర్త నివాస్ దర్శకత్వంలోనే ఓ సినిమా తీయాలనుకుంది. అప్పట్లో ఫైనాన్సియర్స్ కోసం ప్రయత్నించిన రాశి, ఈ ప్రయత్నాల్లో ఓ నిర్మాతని సంప్రదించగా ఆమెకు ఊహించని షాక్ ఎదురైనట్లుగా వార్తలు వచ్చాయి.
రాశి రెండేళ్ల క్రితం 'సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డుల' కార్యక్రమంలో తలుక్కుమని మెరిసింది. ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరిలో హైదరాబాద్‌లో ఫంక్షన్ లో దర్శనం ఇచ్చిన రాశి...మీడియాతో మాట్లాడుతూ తన రీ ఎంట్రీ వివరాలను ప్రకటించింది. బాగా లావెక్కడం మూలంగానే ఈ ఏడేళ్లు సినిమాలకు దూరం అయ్యానని, ఇప్పుడు సన్న బడ్డానని చెప్పుకొచ్చింది. ఇంత కాలం చాలా అవకాశాల వచ్చినా కావాలనే పక్కన పెట్టానని, త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని, హీరోయిన్ లేదా, బాగా ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే తన రీ ఎంట్రీకి సంబంధించిన వివరాలను అఫీషియల్ గా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











