రామ్ గోపాల్ వర్మ అతడి కాళ్లు పట్టుకున్నాడా? సంచలన ట్వీట్..
Recommended Video

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల పాల్‌ను ముంబై హోటల్‌లో కలిసిన వర్మ... అతడి కాళ్లు పట్టుకున్నారు. ఈ విషయాన్ని కెఏ పాల్ సైతం ధృవీకరిస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. దేవుడిని, మతాలను నమ్మని రామ్ గోపాల్ వర్మ ఇలా ఒక మత ప్రచారకుడి కాళ్లు పట్టుకుంటారని, అతడి ఆశీర్వాదం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. అయితే పాల్ చేసిన ట్వీట్‌కు ఆర్జీవీ కౌంటర్ ట్వీట్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
అతడి బుర్ర సెట్టవుతుందని..
‘‘ప్రభువా ! నేను పాల్ కాళ్ళు ముట్టుకోలేదు..జస్ట్ పట్టుకుని గట్టిగా లాగితే వెనక్కి పడి తల నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా ..కాని మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేసా'' అంటూ వర్మ ట్వీట్ చేశారు.
పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్
గత నాలుగు రోజులుగా రామ్ గోపాల్ వర్మ కెఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యేది ఆయనే అని, ఏపీలోని 175 సీట్లను ఆయన గెలవబోతున్నారు... జీసెస్ తర్వాత ఈ ప్రపంచంలోని గొప్ప వ్యక్తి ఆయనే అని సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేశారు.

డిక్టేటర్‌తో కెఏ పాల్
డిక్టేటర్ గడాఫికి కూడా కెఏ పాల్ అడ్వైజర్‌గా ఉండే వాడంటూ.... అతడి గురించి వరుస ట్వీట్స్ చేశారు ఆర్జీవి. మరి ఈ కాంట్రవర్సల్ డైరెక్టర్ ఉన్నట్టుండి పాల్ మీద ఎందుకు పడ్డారో తెలియాల్సి ఉంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల ఉదంతాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











